త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trump Xi Jinping Summit US China | ట్రంప్ – జిన్‌పింగ్ మెగా సమ్మిట్: ఏఐ, ట్రేడ్, మిడిల్ ఈస్ట్ యుద్ధంపై ప్రపంచం దృష్టి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్ భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ట్రేడ్ టారిఫ్‌లు, మిడిల్ ఈస్ట్ యుద్ధంపై కీలక చర్చలు.

J

International | Published On Sep 24, 2026, 7.35 pm IST

Trump Xi Jinping Summit US China | ట్రంప్ – జిన్‌పింగ్ మెగా సమ్మిట్: ఏఐ, ట్రేడ్, మిడిల్ ఈస్ట్ యుద్ధంపై ప్రపంచం దృష్టి

సంక్షిప్త సారాంశం

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మూడ్రోజుల అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌కు చేరుకోగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్‌పోర్టులో స్వయంగా స్వాగతం పలికారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ట్రేడ్ టారిఫ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిడిల్ ఈస్ట్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల గురించి చర్చించనున్నారు. ఏఐ విషయంలో కఠినమైన గార్డ్‌రైల్స్ (నియంత్రణలు) అవసరం లేదని, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) చట్టాలే దాన్ని చూసుకుంటాయని ఇరు దేశాలు భావిస్తున్నాయి. వైట్‌హౌస్‌లో షి జిన్‌పింగ్ గౌరవార్థం ట్రంప్ ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికి, సంప్రదాయ అమెరికన్-చైనీస్ వంటకాలతో అద్భుతమైన స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు.

Advertisement

Trump Xi Jinping Summit US China | త్రినేత్ర.న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ (Xi Jinping) మధ్య వాషింగ్టన్‌లో అత్యంత కీలకమైన శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు మూడ్రోజుల పర్యటన నిమిత్తం మేరీల్యాండ్‌కు చేరుకున్న షి జిన్‌పింగ్‌కు ట్రంప్ ఎయిర్‌పోర్ట్‌లో స్వయంగా ఘన స్వాగతం పలికారు. 1962 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు విదేశీ నేతకు నేరుగా ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

చైనా-అమెరికా శత్రువులు కాదని, 'భాగస్వాములు' కావాలని వాషింగ్టన్ చేరుకున్న సందర్భంగా షి జిన్‌పింగ్ పేర్కొన్నారు. చైనా పునరుజ్జీవనం, అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం (Make America Great Again) కలిసి సాధ్యమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేశారు.

ప్రధాన అజెండా: ట్రేడ్, ఏఐ, యుద్ధాలు

ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ట్రేడ్ టారిఫ్‌లు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిలిటరీ సంబంధాలు, మధ్యప్రాచ్య (Middle East) సంక్షోభాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్‌కు అమెరికా ఆయుధ విక్రయాల అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై స్పందిస్తూ.. దీన్ని తాను 'సూపర్ ఇంటెలిజెన్స్' (SI) అని పిలుస్తానని ట్రంప్ తెలిపారు. ఏఐ అంశం ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశం అయినప్పటికీ, దీనిపై ఎలాంటి కఠినమైన ప్రత్యేక నియంత్రణలు (Guardrails) పెట్టాల్సిన అవసరం లేదని, అమెరికా న్యాయశాఖ (Department of Justice) చట్టాలే దాన్ని నియంత్రిస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. చైనా కూడా ఇదే అభిప్రాయంతో ఉందని ఆయన పేర్కొన్నారు.

న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన ఆర్థిక, వాణిజ్య సలహా సమావేశాల్లో ఇరు దేశాలు పలు ఆర్థిక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనా వైస్ ప్రీమియర్ హి లిఫెంగ్, యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం, గ్రాండ్ డిన్నర్

గురువారం వైట్‌హౌస్‌లో షి జిన్‌పింగ్‌కు ఘనమైన సైనిక వందనం, లాంఛనప్రాయ స్వాగతం లభించింది. ఓవల్ ఆఫీస్‌లో కీలక చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే దిశగా చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, ప్రథమ మహిళ పెంగ్ లియువాన్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో ప్రత్యేకంగా 'స్టేట్ డిన్నర్' ఏర్పాటు చేశారు. అమెరికన్ స్పెషల్ వంటకాలతో పాటు కొన్ని చైనీస్ వంటకాల రుచులు కలగలిసేలా ఈ విందును సిద్ధం చేశారు. మొక్కజొన్న వెలౌటే, సీబాస్ ఫిష్, వైట్‌హౌస్ హనీతో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌తో కూడిన డెజర్ట్‌ను ఈ విందులో వడ్డించనున్నారు.

ప్రపంచంలోని రెండు ఆర్థిక మహాశక్తులైన అమెరికా, చైనా అధినేతల ఈ సమావేశం భవిష్యత్తులో గ్లోబల్ టెక్నాలజీ, ట్రేడ్, భద్రతా విధానాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Advertisement
Advertisement