త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కొండా ల‌క్ష్మ‌ణ్ ఆశ‌యాల‌ను ఆచ‌రిస్తేనే వారికి నిజ‌మైన నివాళి: కేసీఆర్‌

KCR | బహుజన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పరితపించిన కొండా లక్ష్మ‌ణ్‌ బాపూజీ ఆశయాలను ఆచరిస్తేనే, వారికి నిజ‌మైనా నివాళి అర్పించిన‌వాళ్ల‌మ‌వుతామ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

S

Telangana | Published On Sep 27, 2026, 1.28 pm IST

KCR | కొండా ల‌క్ష్మ‌ణ్ ఆశ‌యాల‌ను ఆచ‌రిస్తేనే వారికి నిజ‌మైన నివాళి: కేసీఆర్‌
Advertisement

KCR | త్రినేత్ర న్యూస్: బహుజన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పరితపించిన కొండా లక్ష్మ‌ణ్‌ బాపూజీ ఆశయాలను ఆచరిస్తేనే, వారికి నిజ‌మైనా నివాళి అర్పించిన‌వాళ్ల‌మ‌వుతామ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. న‌మ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన ఆద‌ర్శ‌నీయుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని కొనియాడారు. సమైక్య పాలకుల దమన నీతిని ఎదురించి, త‌న‌ భుజం తట్టి అండగా నిలిచిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం బాపూజీ జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి అర్పించారు.

స్వాతంత్య్ర‌ సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ. నమ్మిన సిద్ధాంతం కోసం మొక్కవోని పట్టుదలతో, రాజీలేని పోరాటం చేసిన బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం. నేను పార్టీని స్థాపించి మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు, నాటి సమైక్య పాలకుల దమన నీతిని ఎదురించి, భుజం తట్టి అండగా నిలిచారు.

తన జల దృశ్యం నివాసాన్ని తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పార్టీ ఆవిర్భావానికి వేదికగా ఇచ్చిన బాపూజీ, గొప్ప వ్యక్తిత్వం కలిగిన రాజనీతిజ్ఞుడని కేసీఆర్ కొనియాడారు. వారి కృషిని గౌరవిస్తూ, వారి త్యాగాలు రేపటి తరాల వారికి గుర్తుంచుకునేలా, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పలు కార్యక్రమాలు అమలు చేశామన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించామన్నారు.

ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, వారి పేరుతో హార్టికల్చరల్ యూనివర్సిటీనీ స్థాపించుకున్నామని, బాపూజీ ఆశయాలకు అనుగుణంగా సబ్బండ కుల వృత్తుల సంక్షేమం అభివృద్ధి కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు విజయవంతమై దేశం దృష్టిని ఆకర్షించాయని కేసీఆర్ గుర్తుచేశారు.

టీఆర్ఎస్‌కు నీడ‌నిచ్చిన గొప్ప తెలంగాణ‌వాది: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలుకుతూ.. కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తన ఇంట్లోనే నీడనిచ్చిన గొప్ప తెలంగాణవాది. వివిధ దశల్లో తెలంగాణ స్వరాష్ట్ర పోరుకు వారు అందించిన సేవలు చిరస్మరణీయం. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని గౌరవించింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.

 

Advertisement
Advertisement