Border Trade | టిబెట్‌లో భారీగా హిమపాతం.. భారత్-చైనా సరిహద్దుల్లో నిలిచిన వాణిజ్యం
Border Trade | భారత్-చైనా (India China) మధ్య ఇటీవలే ప్రారంభమైన సరిహద్దు వాణిజ్యం (Border Trade) అప్పుడే నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గడ్ జిల్లాలో ఉన్న లిపులేఖ్ కనుమ (Lipulekh Pass) ద్వారా ఇరు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం జరుగుతున్నది.
Border Trade | త్రినేత్ర న్యూస్: భారత్-చైనా (India China) మధ్య ఇటీవలే ప్రారంభమైన సరిహద్దు వాణిజ్యం (Border Trade) అప్పుడే నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గడ్ జిల్లాలో ఉన్న లిపులేఖ్ కనుమ (Lipulekh Pass) ద్వారా ఇరు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం జరుగుతున్నది. అయితే టిబెట్‌లోని కీలకమైన తక్లాకోట్ (Taklakot) మార్కెట్ పరిసరాల్లో భారీ హిమపాతం (Heavy Snowfall) కురుస్తున్నది. దీంతో అక్కడ సుమారు 18 ఇంచుల మేర మంచు పేరుకుపోవడంతోపాటు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎత్తయిన ఈ కనుమ మార్గంలో ప్రయాణం పూర్తిగా అసాధ్యంగా మారడంతో ఇదరు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం హఠాత్తుగా నిలిచిపోయింది. కోవిడ్ మహమ్మారి, సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఆరేండ్ల పాటు నిలిచిపోయిన ఈ వాణిజ్య మార్గం, ఈఏడాది ఆగస్టులోనే పునఃప్రారంభమైంది.

సాధారంగా ఈ లిపులేఖ్ కనుమ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ చివరి వారం వరకు వాణిజ్యం (India China Border Trade) జరుగుతుంది. అయితే, అధికారిక అనుమతుల్లో ఆలస్యం కావడంతో ఆగస్టులోనే వ్యాపారం ప్రారంభమైంది. ఇప్పటికే వ్యాపారులు విలువైన సమయాన్ని కోల్పోగా, వాతావరణం ఇలా మారడం స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది.

చిక్కుకుపోయిన వ్యాపారులు
కాగా, ఆగస్టులో మొదటి బృందం తక్లాకోట్ చేరుకోగా, సెప్టెంబర్ 22 నాటికి రూ. 23.63 లక్షల విలువైన సరుకులతో ఆరుగురు వ్యాపారులు, నలుగురు సహాయకులతో కూడిన మూడో బృందం టిబెట్‌లోకి ప్రవేశించింది. తక్లాకోట్ మార్కెట్ పరిసరాల్లో భారీ హిమపాతం కురవడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. మరోవైపు వాతావరణం మారడానికి ముందే తొమ్మిది మంది భారతీయ వ్యాపారులు తాము కొనుగోలు చేసిన సరుకులతో సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చేశారు. కానీ, మిగిలిన వ్యాపారులు, వారి సహాయకులు తక్లాకోట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం వల్ల ఈ ఏడాది (2026) వ్యాపార కాలం పూర్తిగా ముగిసిపోయే ప్రమాదం ఉందని, తాము ఎంతో కష్టపడి సిద్ధం చేసుకున్న సరుకులను అమ్ముకోలేకపోతామని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఎగుమతులు, దిగుమతులు ఏయే వస్తువులంటే..
లిపులేఖ్ కనుమ ద్వారా చైనా నుంచి ఉన్ని, పష్మినా, ఉప్పు, బోరాక్స్, పట్టు, వెన్న, యాక్ హెయిర్, తోలు వంటివాటిని భారత్ దిగుమతి చేసుకుంటుంది. చైనాకు వస్త్రాలు, దుప్పట్లు, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, రాగి ఉత్పత్తులు, వ్యవసాయ పనిముట్లు, స్టేషనరీ, పాదరక్షలు, వంట నూనెలు వంటి వస్తువులను ఎగుమతి చేస్తుంది. ఈ వాణిజ్యం స్థానిక ఉపాధి అవకాశాలను పెంచుతుంది. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.

లిపులేఖ్ పాస్ ఎందుకు కీలకం?
లిపులేఖ్ పాస్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1962 భారత్-చైనా యుద్ధం తర్వాత దీనిని మూసివేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత్- చైనా సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం తర్వాత 1991లో లిపులేఖ్ కనుమ ద్వారా వాణిజ్యం తిరిగి ప్రారంభమైంది. అయితే, 2020లో కొవిడ్ విజృంభణ, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కారణంగా ఈ కనుమ ద్వారా జరుగుతున్న సరిహద్దు వాణిజ్యం ప్రభావితం అయ్యింది. ఆ తర్వాత 2024లో లిపులేఖ్ పాస్ గుండా పరిమిత స్థాయిలో సరిహద్దు వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. రణరంగంగా ఎల్పీయూ క్యాంపస్
- ●ULC | అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులకు మోక్షం.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
- ●Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక: ప్రియదర్శి ధన్యవాదాలు
- ●KTR | కాంగ్రెస్ బీజేపీ అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి రెండేండ్లు: కేటీఆర్
- ●Karimnagar | చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చుకున్నాడు..

Vemula Prashanth Reddy | కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. రణరంగంగా ఎల్పీయూ క్యాంపస్

ULC | అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులకు మోక్షం.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక: ప్రియదర్శి ధన్యవాదాలు





