ULC | అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులకు మోక్షం.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ULC | రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ULC | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. అర్హత ఉన్న యూఎల్‌సీ కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు. GO 455, 456, 747, 92 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలని సూచించారు. యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారం కోసం తాజాగా మెమో నం.48062 జారీచేసిన ప్రభుత్వం.. అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని స్పష్టచేసిందన్నారు. యూఎల్‌సీ పెండింగ్ దరఖాస్తుల విషయంలో 2016లోనే అప్పటి ప్రభుత్వం జీవో చేసినా అమలు చేయలేదన్నారు. దీంతో వేలాది దరఖాస్తులు ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉండిపోయాయని చెప్పారు.
22ఏ సమస్యలను (22 A Property Issues) ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నదని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నదని చెప్పారు. 22ఏ సమస్యలపై మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. జీవో 118, జీవో 76లకు అనుగుణంగా ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిందన్నారు. 22ఏలో ఉన్నా అనుమతులు కలిగిన ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతించిందని పేర్కొన్నారు. తాజాగా యూఎల్‌సీపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేందని, మిగిలిన 22ఏ సమస్యలకూ ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో పరిష్కరిస్తామన్నారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సెప్టెంబర్ 27, 2026

Manmohan Singh | భారతదేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ : సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 26, 2026

Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ●KCR | కొండా లక్ష్మణ్ ఆశయాలను ఆచరిస్తేనే వారికి నిజమైన నివాళి: కేసీఆర్
- ●Vemula Prashanth Reddy | కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. రణరంగంగా ఎల్పీయూ క్యాంపస్
- ●Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు : ప్రియదర్శి
- ●KTR | కాంగ్రెస్ బీజేపీ అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి రెండేండ్లు: కేటీఆర్

Ponguleti Srinivas Reddy | ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

KCR | కొండా లక్ష్మణ్ ఆశయాలను ఆచరిస్తేనే వారికి నిజమైన నివాళి: కేసీఆర్

Vemula Prashanth Reddy | కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. రణరంగంగా ఎల్పీయూ క్యాంపస్



