త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ప్రజల భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త‌ పరిష్కార‌మే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy | కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు.

G

Telangana | Published On Sep 27, 2026, 1.45 pm IST

Ponguleti Srinivas Reddy | ప్రజల భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త‌ పరిష్కార‌మే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్‌: కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. గత ప్రభుత్వం 2016లోనే యూఎల్‌సీ కింద పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీవో జారీ చేసినప్పటికీ, దానిని అమలు చేయకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏండ్ల‌ తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని చెప్పారు. ఫలితంగా ప్రజలు తమ భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంకల్పానికి అనుగుణంగా సహచర క్యాబినెట్ మంత్రులతో చర్చించి 22ఏ సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

యూఎల్‌సీ పెండింగ్ దరఖాస్తులపై..

తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (ULC) కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని (Regularisation) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నంబ‌రు 455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ యూఎల్‌సీ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా మెమో నంబ‌రు 48062/ULC/A1/2026-1 జారీ చేసినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి క్రమబద్ధీకరణ చర్యలు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించామ‌న్నారు.

2016లోనే జీవో.. అమలు మాత్రం శూన్యం

యూఎల్‌సీ సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం 2016లో జీవో జారీ చేసినప్పటికీ, ఆ జీవోను అమలు చేయకపోవడంతో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు.

22A సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం

ఈ నెల 16న శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సెక్షన్ 22Aతో (Section 22A) ముడిపడి ఉన్న 10–12 కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న‌దని మంత్రి తెలిపారు. ఇప్పటికే 22ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జీఓ 118కు అనుగుణంగా మెమో జారీ, ఆ వెంటనే జీఓ 76కు అనుగుణంగా మెమో ఇచ్చామ‌న్నారు. 22ఏలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ (HMDA), డీటీసీపీ (DTCP), మున్సిపల్ అనుమతులు కలిగిన ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఉత్తరులు జారీ చేశామ‌న్నారు. తాజాగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మిగిలిన అన్ని సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపిస్తామని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల (Land Issues) నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. వారికి ఇబ్బందులు కలిగిస్తున్న ప్రతి భూ సమస్యను పరిశీలించి, చట్టం, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement