CM Yogi Adityanath | హ్యాట్రిక్ కొడతాం.. 320 సీట్ల మార్కు దాటడం తథ్యం.. యూపీ ఎన్నికలపై సీఎం యోగి ధీమా
CM Yogi Adityanath | త్వరలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో (Uttar Pradesh Assembly Elections 2027) బీజేపీ కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమ కూటమి ఏకంగా 320కిపైగా స్థానాలను కైవం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.
CM Yogi Adityanath | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Uttar Pradesh Assembly Elections 2027) భారతీయ జనతా పార్టీ (BJP) హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమ కూటమి ఏకంగా 320కిపైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఫలితాలపై అనుమానాలు అవసరం లేదన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత రికార్డులను కూడా బీజేపీ అధిగమిస్తుందని స్పష్టం చేశారు. గతానికి, నేటి యూపీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచి ఓట్లు అడుగుతామని తెలిపారు.
ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై యోగి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు అనుసరించిన కుటుంబ పాలన, కుల రాజకీయాల వల్ల రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని వ్యాఖ్యానించారు. “కుటుంబ, కుల రాజకీయాలు ఉత్తరప్రదేశ్‌ను సర్వనాశనం చేశాయి. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాయి. ఒకప్పుడు కర్ఫ్యూలు, అల్లర్లే రాష్ట్రానికి పర్యాయపదాలుగా మారాయి. బుజ్జగింపు రాజకీయాలకు, రాజకీయాల నేరమయానికి సమాజ్‌వాదీ పార్టీ మారుపేరుగా నిలిచింది” అని విమర్శించారు.
గత ప్రభుత్వాల హయాంలో సాగిన ‘జంగిల్ రాజ్’, ‘గూండా రాజ్’, కర్ఫ్యూలు, అల్లర్ల అంశాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. వాటినే తమ ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రాలుగా చేసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోసారి స్పష్టమైన మెజారిటీతో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. “మూడోసారి కూడా బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు” అని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వాలు అల్లరిమూకలతో వ్యవహరించిన తీరును తప్పుపట్టిన యోగి.. తమ ప్రభుత్వ హయాంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. నేడు అల్లరిమూకలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము అనుసరిస్తున్న కఠిన చర్యల వల్ల నేడు యూపీపై దేశవ్యాప్తంగా కొత్త అభిప్రాయం ఏర్పడిందని యోగి చెప్పుకొచ్చారు.
2017కి ముందు ఎస్పీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు కనీసం ఒక్క పెట్టుబడిదారుడు కూడా ముందుకు రాలేదని సీఎం విమర్శించారు. గత ముఖ్యమంత్రులు నోయిడాను సందర్శించేందుకు భయపడేవారని, సుపరిపాలన కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చారని విమర్శించారు. అభివృద్ధిని వ్యతిరేకించే, ఉత్సవాల కంటే అశాంతిని కోరుకునే 15-20 శాతం మంది వ్యక్తులు సమాజంలో ఉన్నారని, అలాంటి వారి కుట్రలు ఎన్నటికీ నెరవేరవని సీఎం హెచ్చరించారు. బీజేపీ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని మరోసారి నొక్కిచెప్పారు.
Also Read..
పెను ప్రమాదంలో భారత ఆర్థిక వ్యవస్థ.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. కొత్తూరు శివారులో ఘటన
తెలంగాణ హైకోర్టులో గుండెపోటు అత్యవసర చికిత్స కోసం 5 చోట్ల లైఫ్ సేవింగ్ డీఫిబ్రిలేటర్ల ఏర్పాటు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chinna Reddy | రేవంత్‌రెడ్డి అవినీతి లక్ష కోట్లు దాటిపోయింది.. ఆయన ఒక బీజేపీ కోవర్ట్
- ●Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
- ●Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
- ●Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్

Chinna Reddy | రేవంత్‌రెడ్డి అవినీతి లక్ష కోట్లు దాటిపోయింది.. ఆయన ఒక బీజేపీ కోవర్ట్

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న

Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్






