Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
Kondagattu Anjanna | కొండగట్టు ఆంజనేయస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి అరవై ఏళ్లకు ఒకసారి స్వామివారి చందనం తొలగించి, నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కల్పించడం ఆనవాయితీ.
Kondagattu Anjanna | త్రినేత్ర న్యూస్: కొండగట్టు ఆంజనేయస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి అరవై ఏళ్లకు ఒకసారి స్వామివారి చందనం తొలగించి, నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కల్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలిరోజు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి చేకూర్చాలని దేవుడిని కోరినట్లు మంత్రి తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ఆలయాల అభివృద్ధికి వందల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కొండగట్టు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఐదు రోజులపాటు జరుగిన ఉత్సవాలకు ఈ నెల 15న శ్రీకారం చుట్టారు. నవంబర్ 16 నుంచి 20 వరకు చందనం తొలగింపు ప్రక్రియ జరిగింది. దాదాపు 500 ఏండ్ల చరిత్ర కలిగిన కొండగట్టు ఆలయం గత 35 ఏండ్లలో అభివృద్ధి చెందింది. గతంలో గర్భగుడిలోని స్వామివారి మూలవిరాట్‌ను ప్రతి శనివారం చందనంతో అలంకరించడంతో విగ్రహంపైన పూత మందం పెరిగింది. 1965లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తొలగించారు. అప్పట్లో మొదటిసారిగా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్న అర్చకులు ఓ చిత్రకారుడితో ఆకారాన్ని గీయించారు.
స్వామివారికి ఉన్న చందనాన్ని పంచ లోహాలతో తయారు చేయించిన రెండు సరాతాలకు బంగారు, వెండి తాపడం చేయించి వాటితో తొలగిస్తారు. దేవతా వృక్షాలుగా భావించే మామిడి, జువ్వి, మర్రి, రావి, మేడి వృక్షాల కలపతో తయారు చేయించిన పనిముట్లను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కృష్ణా, గంగ, తుంగభద్ర, కావేరి, గోదావరి నదులతో పాటు సముద్రం నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం శనివారం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ క్రతువులో బెంగళూరు, విజయవాడకు చెందిన ఇద్దరు జియ్యంగార్లు, 40 మంది రుత్వికులు, 20 మంది అర్చకులు, నలుగురు వేదపండితులు, 10 మంది పాచకులు, పరిచారులు పూజలు, హోమాల్లో పాల్గొన్నారు.
బాలాలయంలో..
చందనం తొలగింపు ప్రక్రియ సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు గర్భగుడి తలుపులు మూసివేశారు. ఆ సమయంలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా కలపతో తయారు చేయించిన 4 అడుగుల ఎత్తున్న స్వామివారి విగ్రహాన్ని గర్భగుడి ద్వారం ముందు ఉంచారు. శనివారం నుంచి డిసెంబర్ 28 వరకు కేవలం స్వామివారి పాదాలకు మాత్రమే చందనం పూయనుండగా 29న తొలి విడత పూర్తి స్థాయిలో చందనంతో అలంకరణ ఉంటుందని అర్చకులు తెలిపారు.
తాజావార్తలు
- ●Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
- ●Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్
- ●KTR | తెలంగాణకు బాద్షా కేసీఆరే.. మళ్ల వచ్చేది ఆయనే
- ●Chukka Ramaiah’s 100th Birthday Celebrations | శిఖర సమానుడు చుక్కా రామయ్య.. నూరేళ్ల పండుగ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్

Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్





