త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Nabin Karimnagar Tour | 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్

Nitin Nabin Karimnagar Tour | బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) ఈనెల 23న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకత్వాన్ని పాతరేద్దాం’ నినాదంతో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

S

Telangana | Published On Nov 20, 2026, 3.56 pm IST

Nitin Nabin Karimnagar Tour | 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
Advertisement
  • లక్ష మందితో మహా పాదయాత్ర

Nitin Nabin Karimnagar Tour | త్రినేత్ర న్యూస్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) ఈనెల 23న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకత్వాన్ని పాతరేద్దాం’ నినాదంతో నిర్వహించనున్న మహా పాదయాత్ర(Foot March) కు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్రలో సుమారు లక్ష మందిని సమీకరించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నితిన్ నబిన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం వైశ్యా భవన్ నుంచి ప్రారంభ‌మ‌య్యే మహా పాదయాత్రలో పాల్గొంటారు. టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్ మీదుగా కమాన్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్, సహ ఇన్‌ఛార్జీలు అభయ్ పాటిల్, రేఖా శర్మ తదితరులు పాల్గొననున్నారు.

జ‌న‌ సమీకరణకు బండి సంజయ్ కసరత్తు

నితిన్ నబిన్ తొలిసారిగా కరీంనగర్‌కు వస్తున్న నేపథ్యంలో మహా పాదయాత్రను భారీ స్థాయిలో నిర్వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) నిర్ణయించారు. ఈ మేరకు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల బీజేపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వరకు పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులను యాత్రకు తరలించేలా కార్యాచరణ రూపొందించాలని బండి సంజయ్ సూచించారు. బూత్, శక్తి కేంద్రాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి జన సమీకరణ చేపట్టాలని, మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.

రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించడమే లక్ష్యం

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నితిన్ నబిన్ తొలిసారిగా కరీంనగర్‌కు వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 'సర్' అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, ఇండీ కూటమి పేరుతో విపక్షాలు ఎన్నికల సంఘం, రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన చేపడుతున్నారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement