త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jabardasth Comedian | యాంక‌ర్‌ను పెళ్లిచేసుకున్న‌ జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ – ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్‌

జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ డేగ‌ల బాబు పెళ్లి చేసుకున్నాడు. శుక్ర‌వారం ప్రియురాలు అమూల్య మెడ‌లో మూడుముళ్లు వేశాడు. వీరి పెళ్లి వేడుక తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. జ‌బ‌ర్ధ‌స్థ్ షోతో కెరీర్ ప్రారంభించిన బాబు ఇటీవ‌లే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో డైరెక్ట‌ర్‌గా మారాడు.

N

Entertainment | Published On Nov 20, 2026, 7.32 pm IST

Jabardasth Comedian |  యాంక‌ర్‌ను పెళ్లిచేసుకున్న‌ జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ – ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్‌
Advertisement

Jabardasth Comedian | తెలుగు యాంక‌ర్ మెడ‌లో మూడుముళ్లు వేశారు జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ డేగ‌ల బాబు . త‌మ‌ది ఏడేళ్ల ప్రేమ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. జ‌బ‌ర్ధ‌స్థ్ షోతో క‌మెడియ‌న్‌గా ఫేమ‌స్ అయ్యాడు డేగ‌ల బాబు. ఆరంభంలో సుడిగాలి సుధీర్ టీమ్‌లో కంటెస్టెంట్‌గా క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఆటో రాంప్ర‌సాద్ టీమ్‌లో కొన‌సాగుతోన్నాడు. చాలా స్కిట్‌ల‌లో త‌న కామెడీ టైమింగ్‌, పంచ్‌ల‌తో న‌వ్వించిన డేగ‌ల బాబు పెళ్లిచేసుకున్నాడు.

అమూల్య‌....

తెలుగు యాంక‌ర్ అమూల్య‌తో శుక్ర‌వారం ఏడ‌డుగులు వేశాడు. వీరి పెళ్లి వేడుక తాలూకు ఫొటోలు వీడియోలు వైర‌ల్ అవుతోన్నాయి. అమూల్య యాంక‌ర్‌గా ప‌నిచేస్తోంది. జ‌బ‌ర్ధ‌స్థ్‌లోకి రాక‌ముందు బాబు న్యూస్ ఛానెల్‌లో ప‌నిచేశాడు. ఆ టైమ్‌లోనే ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు స‌మాచారం.

ఏడేళ్ల ప్రేమ‌...

అమూల్య మెడ‌లో మూడుముళ్లు వేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో డేగ‌ల‌బాబు పోస్ట్ చేశాడు. త‌మ ప్రేమ బంధం ఏడేళ్లుగా కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నాడు. డేగ‌ల బాబు, అమూల్య పెళ్లి వేడుక‌లో ప‌లువురు జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ల‌తో పాటు టీవీ సెలిబ్రిటీలు పాల్గొన్నారు.

డైరెక్ట‌ర్‌గా...

డేగ‌ల బాబు ఇటీవ‌లే డైరెక్ట‌ర్‌గా మారాడు. లీస్ట్ ఎలిజిబుల్ పేరుతో ఓ కామెడీ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించాడు. హ‌ర్ష చెముడు, హైప‌ర్ ఆది ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ తెలుగు వెబ్‌సిరీస్ మంచి విజ‌యాన్ని సాధించింది. కామెడీ సీన్స్‌ను రాసిన తీరుతో పాటు డైరెక్ట‌ర్‌గా బాబు టేకింగ్ బాగుందంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌కు సీజ‌న్ 2 కూడా రాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Babu_Offical (@degala_babu_official)

Advertisement
Advertisement