త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం.. కొత్తూరు శివారులో ఘ‌ట‌న‌

Road Accident | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్‌ (Balmoor Venkat) కు భారీ ప్ర‌మాదం త‌ప్పింది.

S

Telangana | Published On Nov 18, 2026, 10.49 am IST

Road Accident | బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం.. కొత్తూరు శివారులో ఘ‌ట‌న‌
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్‌ (Balmoor Venkat) కు భారీ ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డు ప్ర‌మాదానికి (Road Accident) గుర‌వ‌గా తృటిలో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు శివారులోని వినాయక స్టీల్‌ వద్ద మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటాక ఓ గుర్తు తెలియ‌ని లారీ ఆయన కారును లారీ ఢీకొట్టింది.

రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకోగా ఈ స‌మ‌యంలో వెంకట్‌, ఆయన భార్య ఇందుజ, ఎమ్మెల్సీ సోదరుడు చాణక్య, కారు డ్రైవర్‌ శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement