Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
Rekha Naik | రైస్ మిల్ (Rice mill) నా పేరు మీదనే ఉందని.. అందుకే ఈడీ (ED) వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ (Rekha Naik) అన్నారు. 142 మంది మిల్లర్లపై కేసులున్నా నా రైస్‌మిల్ మీదనే రైడ్స్ చేయడం చాలా బాధించిందన్నారు.
- 142 మంది మిల్లర్లపై కేసులైనా నా ఒక్కదాని మీదనే రైడ్స్ చేయడం బాధించింది
- 10 ఏండ్ల నుంచి ప్రజా సేవలో ఉన్నా.. ఎవరినీ మోసం చేయలే
- ఈడీ రైడ్స్ అనంతరం మీడియాతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ వ్యాఖ్యలు
Rekha Naik | త్రినేత్ర న్యూస్: రైస్ మిల్ (Rice mill) నా పేరు మీదనే ఉందని.. అందుకే ఈడీ (ED) వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ (Rekha Naik) అన్నారు. 142 మంది మిల్లర్లపై కేసులున్నా నా రైస్‌మిల్ మీదనే రైడ్స్ చేయడం చాలా బాధించిందన్నారు. 10 ఏండ్ల నుంచి ప్రజా సేవలో ఉన్నానని.. ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. అదంతా బియ్యం తీసి పంపితే పిండి అయి పురుగు అయిందని.. వర్షానికి ఇబ్బంది అయి లాస్ అయ్యామని వాపోయారు. ఈడీ రైడ్స్ అనంతరం శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
సెర్చ్ వారెంట్‌తో వచ్చారు
CMR రైస్ మిల్ పై జరిగిన కేసు విషయంలోనే ED రైడ్స్ చేసింది. నేను 10 యేండ్లు ప్రజల సేవల్లో ఉన్నాను. ఏ రైతును మోసం చేయలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో టెండర్ పాడితే నష్టం వచ్చింది. సెర్చ్ వారెంట్ తో ఈడీ అధికారులు వచ్చారు. అధికారులను నేను అడిగితే రైస్ మిల్‌కు చెందినది అన్నారు.
ప్రస్తుతం కేసు నడుస్తుంది..
బిజినెస్ అనేది 10 ఏండ్లలో ఏనాడు పట్టించుకోలేదు. నాకు బిజినెస్ తెల్వదు. 10 ఏండ్లు రైస్ మిల్ కు వెళ్ళలేదు. ప్రజల సమస్యల కోసం ఉన్న ప్రజాల్లోనే ఉన్న. 10 యేండ్లు ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నా. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నప్పడి నుండే దాడులు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో కరోనా సమయంలో టెండర్ పాడి 12 కోట్లకు గాను 22 కోట్లు ఇచ్చారు. పెనాల్టీ ఇచ్చారు. దీన్ని ఇదివరకే కోర్ట్ లో కేసు వేశాను. ప్రస్తుతం కేసు నడుస్తుంది అని రేఖా నాయక్ తెలిపారు.
కాగా సత్తెనపల్లిలో ఆమె పేరుతో ఉన్న ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ (ARS Industries) మిల్లులో సుమారు రూ.40.96 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు, రికార్డుల పరిశీలన అనంతరం ఇంత భారీ మొత్తంలో ధాన్యం లెక్కల్లో లోటు ఉన్నట్లుగా తేలింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై గత ఆగస్టులో కేసు నమోదు చేశారు. దీంతో సోదాలు కొనసాగాయి.
తాజావార్తలు
- ●Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
- ●Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్
- ●KTR | తెలంగాణకు బాద్షా కేసీఆరే.. మళ్ల వచ్చేది ఆయనే
- ●Chukka Ramaiah’s 100th Birthday Celebrations | శిఖర సమానుడు చుక్కా రామయ్య.. నూరేళ్ల పండుగ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్

Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్





