CJI Surya Kant | న్యాయమూర్తుల స్థానాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదు : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
CJI Surya Kant | న్యాయపరమైన పరిశోధనలకు, విచారణ ప్రక్రియకు కృత్రిమ మేధ (Artificial intelligence) కేవలం సహాయకారిగా మాత్రమే ఉపయోగపడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) చెప్పారు. న్యాయమూర్తుల విచక్షణా జ్ఞానాన్ని, నిర్ణయాధికారాన్ని మాత్రం అది ఎప్పటికీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.
CJI Surya Kant | త్రినేత్ర న్యూస్ : న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని (technology) ఉపయోగించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపరమైన పరిశోధనలకు, విచారణ ప్రక్రియకు కృత్రిమ మేధ (Artificial intelligence) కేవలం సహాయకారిగా మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు. న్యాయమూర్తుల విచక్షణా జ్ఞానాన్ని, నిర్ణయాధికారాన్ని మాత్రం అది ఎప్పటికీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.
ఉజ్బెకిస్థాన్ (Uzbekistan)లోని సమర్‌కండ్‌లో జరిగిన 'అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ కాన్‌స్టిట్యూషనల్ కోర్ట్స్ అండ్ ఈక్వలెంట్ ఇన్‌స్టిట్యూషన్స్' 7వ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సాంకేతికత తెస్తున్న వేగవంతమైన మార్పుల నుంచి న్యాయస్థానాలు (judicial processes) అతీతంగా ఉండలేవని స్పష్టం చేశారు. అయితే, న్యాయ ప్రక్రియలో సాంకేతికత అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించి అందరికీ న్యాయాన్ని చేరువ చేయాలన్నారు. న్యాయం అందించడంలో మానవీయ కోణం, నైతిక విలువలు అత్యంత ముఖ్యమైనవని గుర్తుచేశారు.
"నేటి సమాజంలో కృత్రిమ మేధపై ఆధారపడటం విపరీతంగా పెరుగుతుందో. అదే సమయంలో వాటి వినియోగాన్ని నియంత్రించే రక్షణ చర్యలు కూడా అలాగే బలపడాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయ ప్రక్రియలను వేగవంతం చేయడానికి, కేసుల పరిష్కారంలో పారదర్శకతను పెంచడానికి డిజిటలైజేషన్, AI వంటి ఆధునిక సాంకేతికతలను అందింపుచ్చుకోవాలని సూచించారు. అదే సమయంలో గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి ప్రాథమిక రాజ్యాంగ విలువలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read..
గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Donald Trump | AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్
సెప్టెంబర్ 30, 2026

Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..
సెప్టెంబర్ 30, 2026

Sachin Tendulkar | సచిన్‌తో ఓపెన్ఏఐ పార్ట్నర్షిప్.. చాట్‌జీపీటీ ద్వారా కీలక భాగస్వామ్యం..
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..
- ●Offshore Minerals | అండమాన్ దీవుల్లో అరుదైన ఖనిజాలు.. రెండు ప్రాంతాలకు వేలం..
- ●CM Revanth Reddy | స్థానిక అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్
- ●Harish Rao | గుండె లోతుల్లోంచి రాసే కవిత్వానికి.. ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు
- ●Telangana Schools | తెలంగాణ స్కూల్ విద్యార్థులకు అలర్ట్..!
- ●Direct-to-Mobile | ఇక ఇంటర్నెట్ లేకున్నా ఫోన్లో నేరుగా లైవ్ టీవీ.. కేంద్రం సన్నాహాలు..?

Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..

Offshore Minerals | అండమాన్ దీవుల్లో అరుదైన ఖనిజాలు.. రెండు ప్రాంతాలకు వేలం..

CM Revanth Reddy | స్థానిక అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్

Harish Rao | గుండె లోతుల్లోంచి రాసే కవిత్వానికి.. ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు



