Na Chitti Chethulu | కన్నీరు పెట్టించే ఆ పాటకు 30 ఏళ్లు.. బడి ఈడు పిల్లల బతుకు గేయం అది..
Na Chitti Chethulu | ఎన్నో సామాజిక, విప్లవ గీతాలు తెలంగాణలో పురుడు పోసుకున్నాయి. ఎన్నో ఉద్యమ గీతాలు జాలు వారాయి. సమాజాన్ని మార్చగలిగిన, రాష్ట్రాన్ని సాధించగలిగిన పాటలు ఈ నేలకు సొంతం. అంతేకాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత కార్యక్రమానికి ఊపిరి పోసిన పాట ఒకటుంది. ఆ పాట 1990 -2000 మధ్య కాలంలో జన్మించిన పిల్లలకు సుపరిచితం.
Na Chitti Chethulu | త్రినేత్ర.న్యూస్ : ఎన్నో సామాజిక, విప్లవ గీతాలు తెలంగాణలో పురుడు పోసుకున్నాయి. ఎన్నో ఉద్యమ గీతాలు జాలు వారాయి. సమాజాన్ని మార్చగలిగిన, రాష్ట్రాన్ని సాధించగలిగిన పాటలు ఈ నేలకు సొంతం. అంతేకాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత కార్యక్రమానికి ఊపిరి పోసిన పాట ఒకటుంది. ఆ పాట 1990 -2000 మధ్య కాలంలో జన్మించిన పిల్లలకు సుపరిచితం. 2010 నాటి వరకు కూడా ప్రతి బడిలో మార్మోగిన పాట అది. ఎంతో మంది బడి ఈడు పిల్లలను చదువుకోవాలనే సంకల్పం వైపు తట్టిలేపింది. కొన్ని లక్షల మంది నిరక్షరాస్య విద్యార్థులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంతకీ ఆ పాట ఏంటంటే.. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో/ నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో’.
బహుషా ఈ పాట ఇప్పటి జనరేషన్‌కు తెలియకపోవచ్చు. కానీ 2010 వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకైతే ఎంతో సుపరిచితం. ఎందుకంటే ప్రతి పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా ఈ పాటను ఏదో ఒక విద్యార్థి ఆలపించేవాడు. అంతేందుకు నాటి ప్రభుత్వాలు నిరక్షరాస్యతను పారదోలి.. అక్షర జ్ఞానాన్ని పెంపొందించేందుకు చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమానికి ఈ పాట ఊపిరి పోసింది. ఉమ్మడి ఏపీలో ఈ పాటతో ప్రేరణ పొంది కనీసం రెండు లక్షలకు పైగా బాలకార్మికులు బడి బాట పట్టారు. నిరక్షరాస్యులుగా మిగిలిపోకుండా.. అక్షరాస్యులుగా మారిపోయారు.
‘నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో/ నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో’ అనే పాటకు ప్రాణం పోసింది చింతల యాదగిరి. ఈయన నల్లగొండ జిల్లా, మేళ్ల దుప్పలపల్లి అనే పల్లెటూరుకు చెందినవాడు. 1975 జనవరి 26న సైదమ్మ, నర్సింహ్మ అనే దంపతులకు జన్మించాడు. వీరు కల్లుగీత కార్మికులు. అయితే తండ్రి నర్సింహ్మ జానపద కళల్లో చురుకుగా ఉండేవారు. ఆయన వారసత్వాన్ని యాదగిరి పుణికి పుచ్చుకున్నాడు.
పాటకు ఎలా ఊపిరి పోశాడంటే..?
యాదగిరి పాఠశాల విద్యను మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. అర్ధాంతరంగా చదువు ఆగిపోయినప్పటికీ.. తనలో ఉన్న కవిత్వాన్ని బయట పెట్టాడు. జన నాట్య మండలి, ప్రజా నాట్య మండలిలో ఉద్యమ గీతాలు ఆలపిస్తూ.. ప్రజా ఉద్యమాల్లో భాగస్వామి అయ్యేవాడు. ఇక బడి మానేసిన యాదగిరి.. “నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో” అనే పాటకు స్వరం కట్టి.. అక్షరాస్యత ఉద్యమానికి నాంది పలికాడు.
అందరి పిల్లల్లా పలక బలపం పట్టుకొని బడికెళ్ళి చదువుకోవాలనే గాఢమైన ఆకాంక్ష కలిగి ఉన్నప్పటికీ.. కళ్ల ముందున్న కష్టాలను అర్థవంతంగా ఆ గీతంలో రచించాడు. చిన్న చేతిసంచి కూడా సరిగ్గా మోయలేని భుజాలు మేడి పట్టుకుని పొలం దున్నవలసిన దుస్థితిని అద్భుతంగా వర్ణించాడు. ఏడేండ్ల వయసు నాటికే తల్లిదండ్రులకు దూరమయ్యాను.. దొరగారి ఎడ్ల కొట్టం కాడికి చేరువయ్యాను అనే పదాలు.. యాదగిరిని ఆర్థిక పరిస్థితులు ఎలా కుంగదీశాయో తెలుస్తుంది. అయ్యజేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే.. ఆ వడ్డీ లెక్కలకంటే ఎక్కువ కష్టం చేసితినే అంటూ తన రెక్కల కష్టాన్ని చెప్పుకున్నాడు. వాళ్ళ ఎడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగజూస్తారే /కడుపుగాలిన నాకు గొడ్డుకారం ముద్దలు పెడతారే అంటూ ఆకలి బాధలను పంచుకున్నాడు చింతల యాదగిరి. ఈ పాటలోని ప్రతి పదం.. కన్నీరు పెట్టిస్తుంది. వాగ్గేయకారుడైన చింతల యాదగిరి 2024 డిసెంబర్ 15న ఢిల్లీ వేదికగా బహుజన సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
నా చిట్టి చేతులు పూర్తి పాట మీ కోసం..
నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో
నా సంకల మేడితో సాలిరువాలు దున్నీనానయ్యో
నను గన్నవాళ్ళకు ఏడేండ్లప్పుడు దూరమయ్యాను
దొరగారి ఎడ్ల కొట్టంకాడికి చేరువయ్యాను
మూడు మూరలకర్రతో ముప్పైగాడ్లతో సోపతి నాదయ్యో
దిక్కు దిక్కూన ఉరుకంగ లేలేతకాళ్ళకు గుచ్చెనుముండ్లయ్యో || నా చిట్టి చేతులు||
వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను
మా అమ్మాఅయ్యా రాకముందే నిదురపోతాను
సుక్కగూకిన జాముకు ఎడ్లకొట్టం సూరుకాడుంట
తెల్లవెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బాయికాడుంట || నా చిట్టి చేతులు||
బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్య బెడుతుంటే
తేపతేపకు దొరసాని రోకటి పోటుల మాటలంటుంటే
అయ్యజేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే
ఆ వడ్డీ లెక్కలకంటే ఎక్కువ కష్టం చేసితినే || నా చిట్టి చేతులు||
వాళ్ళ ఎడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగజూస్తారే
కడుపుగాలిన నాకు గొడ్డుకారం ముద్దలు పెడతారే
చిన్నవొళ్ళుకు చిల్లులు పడ్డా అంగీ ఒక్కటున్నాదే
వాళ్ళ బిడ్డల ఒంటికి రంగు బట్టలు రోజు మారేనే || నా చిట్టి చేతులు||
పెద్దోళ్ళ బిడ్డలు ఏమీజేసిన ఎంతో ప్రచారం
నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో యికారం
చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే
నా గుండెలమీద పుండునుజేసే పనులకు పంపకురే || నా చిట్టి చేతులు||
అమ్మా నాన్నా అందరికీ నే దండం పెడుతున్నా
నా బాధను గాథను ఆలోచించురి కాళ్ళు మొక్కుతున్నా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramchander Rao | అధికారాన్ని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించారు : రామచందర్ రావు
జులై 3, 2026

Komatireddy Rajagopal Reddy | పాత కాంగ్రెస్ నేతలంతా కనుమరుగు.. రేవంత్ నాకు నచ్చడం లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
జులై 1, 2026

Tunga Balu | యాదాద్రి ట్రస్ట్ బోర్డులో స్థానికులకు చోటేది..? నిలదీసిన తుంగ బాలు
జులై 1, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



