త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE OSM controversy | నేను బాధ్య‌త వ‌హిస్తున్నా.. సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్ వివాదంపై కేంద్ర మంత్రి

CBSE OSM controversy | ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) విధానంపై తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి (CBSE OSM controversy). ఈ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) స్పందించారు. ఈ లోపాల‌కు తాను బాధ్య‌త తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

D

National | Published On May 28, 2026, 1.30 pm IST

CBSE OSM controversy | నేను బాధ్య‌త వ‌హిస్తున్నా.. సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్ వివాదంపై కేంద్ర మంత్రి
Advertisement

CBSE OSM controversy | ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) విధానంపై తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి (CBSE OSM controversy). ఈ విధానం కారణంగా తమ జవాబు పత్రాలు తారుమారు అయ్యాయంటూ పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల స్కానింగ్‌ కోసం పెద్దఎత్తున విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను 17 లక్షల మంది విద్యార్థులు రాయ‌గా.. వీరిలో ఇప్పటివరకు 4,04,319 మంది స్కానింగ్‌ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) స్పందించారు. ఈ లోపాల‌కు తాను బాధ్య‌త తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. మూల్యాంక‌న ప్ర‌క్రియ‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు తేలితే .. బాధ్యుల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌కు మంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీలో సీబీఎస్‌ఈ అధికారులతో సమావేశం అనంతరం ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ మీడియాతో మాట్లాడారు. "నేను బాధ్యత తీసుకుంటున్నాను. దీనిని సరిచేస్తాం. పరిష్కారాన్ని కనుగొంటాం" అని ఆయన చెప్పారు. అదేవిధంగా స్కాన్ చేసిన జ‌వాబు ప‌త్రాలు, మూల్యాంక‌న స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదులు వ‌స్తున్న త‌రుణంలో.. విద్యార్థుల్లో మ‌రింత ఒత్తిడిని పెంచేలా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని విప‌క్ష పార్టీల‌ను కేంద్ర మంత్రి కోరారు.

ఈ నెల 13న విడుదల చేసిన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గత ఏడాది కన్నా 3 శాతం ఉత్తీర్ణత తగ్గింది. అయితే ఈ ఏడాది అమల్లోకి తెచ్చిన ఓఎస్‌ఎం విధానం వల్ల పలువురి జవాబు పత్రాలు తారుమారయ్యాయని, అందుకో కొందరికి తక్కువ మార్కులు రాగా, పరీక్ష బాగా రాసిన చాలామంది ఫెయిల్‌ అయ్యారంటూ పలువురు విద్యార్థులు ఆరోపించారు.

Advertisement
Advertisement