NHPC | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. NHPC లో 6 శాతం వాటా విక్రయం.. ఇప్పుడు కొనవచ్చా..?
NHPC | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెట్టుబడిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NHPC)లో 6 శాతం మేర వాటాను విక్రయిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది.
NHPC | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెట్టుబడిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NHPC)లో 6 శాతం మేర వాటాను విక్రయిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఇందులో మంగళవారం ఇప్పటికే నాన్ రిటెయిల్ ఇన్వెస్టర్లకు 3 శాతం వాటాను అందుబాటులో ఉంచగా, బుధవారం మరో 3 శాతం వాటాను రిటెయిల్ ఇన్వెస్టర్లకు విక్రయించనుంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో చాలా మంది పెట్టుబడిదారులు ఈ సంస్థ షేర్ల కోసం ఎదురు చూస్తుండగా, కేంద్రం తన వాటాలో 6 శాతాన్ని ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నట్లు తెలిపింది. NHPCలో కేంద్రానికి మొత్తం 67.4 శాతం వాటా ఉండగా అందులో తాజా విక్రయాలతో 6 శాతం వాటా తగ్గనుంది. అయితే మంగళవారం బేస్ ఆఫర్ కింద 3 శాతం వాటాను అందుబాటులో ఉంచినప్పటికీ పెట్టుబడిదారుల నుంచి స్పందన ఆశించిన రీతిలో ఉంటే బుధవారం మరో 3 శాతం వాటాను గ్రీన్ షూ ఆప్షన్ కింద అందుబాటులో ఉంచనుంది. దీన్నే ఓవర్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ అని కూడా అంటారు.
అమ్మకానికి 60 కోట్ల షేర్లు..
కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాలను కొద్ది కొద్దిగా విక్రయిస్తూ వస్తోంది. ఇటీవలే భెల్, ఐఆర్ఎఫ్‌సీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియాలలో వాటాలను విక్రయించగా, ఇప్పుడు NHPC లో వాటాను విక్రయిస్తోంది. అయితే ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను విక్రయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగానే NHPC షేర్ ధర భారీగా పతనమైంది. మంగళవారం నాటి ఉదయం సెషన్ ప్రారంభం వరకు ఈ షేర్ 6 శాతం మేర పతనమైంది. ఇంట్రా డే కనిష్టాన్ని తాకిన షేర్ ధర రూ.72.63 మార్క్‌ను అందుకుంది. అయితే ఈ షేర్లను కేంద్రం 8 శాతం డిస్కౌంట్ ధరకు విక్రయిస్తోంది. అంటే ఒక్కో షేరును పెట్టుబడిదారులు రూ.71కే కొనుగోలు చేయవచ్చన్నమాట. ఇక మంగళవారం నాటి సెషన్‌లో మొత్తం 30.13 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా బుధవారం నాడు మరో 30.13 కోట్ల షేర్లను విక్రయించనుంది. దీంతో మొత్తం 60.27 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ.4,279 కోట్ల మేర ఆదాయాన్ని పొందాలని కేంద్రం ఆలోచిస్తోంది.
ఆశించిన స్థాయిలో లేని వృద్ధి..
అయితే వాస్తవానికి NHPC ప్రదర్శన ఏమాత్రం సరిగ్గా లేదని నిపుణులు చెబుతున్నారు. గతేడాది కాలంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 11.6 శాతం తగ్గింది. గత 5 ఏళ్లలో ఈ సంస్థ కేవలం 3.78 శాతం అమ్మకాల వృద్ధిని మాత్రమే సాధించింది. ఇక చాలా వరకు బ్రోకరేజీ సంస్థలు, నిపుణులు ఈ షేర్‌కు సెల్ (SELL) రేటింగ్‌ను ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారని, అయితే షేర్‌ను సరైన ధరకు కొనాలని, ప్రస్తుతం వేచి చూస్తే మంచిదని, నిపుణుల సలహా పాటిస్తే నష్టం రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
జూన్ 2, 2026

Stock Markets | భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు..
జూన్ 2, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.4.26 లక్షల కోట్ల సంపద ఆవిరి..
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Oppo Instagram | క్రియేటర్ల కోసం ఒప్పో-ఇన్స్టాగ్రామ్ సరికొత్త ప్రోగ్రామ్.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయవచ్చు..
- ●Pawan Kalyan | తెలంగాణలో జనసేన ఉంటుంది.. నేను తిరుగుతా : పవన్ కల్యాణ్
- ●Peddi | తెలంగాణలో రామ్ చరణ్ పెద్ది టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే ? - బెనిఫిట్ షోలకు పర్మిషన్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●CBSE | 2 నిమిషాల్లో 15 లక్షల సైబర్ దాడులు.. రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్‌కు గురవడంపై సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ
- ●Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ - జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ

Oppo Instagram | క్రియేటర్ల కోసం ఒప్పో-ఇన్స్టాగ్రామ్ సరికొత్త ప్రోగ్రామ్.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయవచ్చు..

Pawan Kalyan | తెలంగాణలో జనసేన ఉంటుంది.. నేను తిరుగుతా : పవన్ కల్యాణ్

Peddi | తెలంగాణలో రామ్ చరణ్ పెద్ది టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే ? - బెనిఫిట్ షోలకు పర్మిషన్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..



