త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indians in Gulf | ఉపాధి కోసం వ‌చ్చాం.. బంక‌ర్ల కోసం వెతుక్కోవాల్సి వ‌స్తోంది : గ‌ల్ఫ్ దేశాల్లో భార‌తీయుల ఆవేద‌న‌

Indians in Gulf | దాడులు, ప్ర‌తిదాడుల‌తో మ‌ధ్య‌ప్రాచ్యం అట్టుడుకుతోంది. ఈ యుద్ధం కార‌ణంగా గ‌ల్ఫ్ ప్రాంతాల‌కు విమాన స‌ర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో ఆయా దేశాల్లో ప‌ర్యాట‌కులు, విద్యార్థులు, కార్మికులు స‌హా వేలాది మంది భార‌తీయులు చిక్కుకుపోయారు (Indians in Gulf). వారంతా అక్క‌డ దిక్కుతోచ‌ని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు.

D

National | Published On Mar 2, 2026, 3.56 pm IST

Indians in Gulf | ఉపాధి కోసం వ‌చ్చాం.. బంక‌ర్ల కోసం వెతుక్కోవాల్సి వ‌స్తోంది : గ‌ల్ఫ్ దేశాల్లో భార‌తీయుల ఆవేద‌న‌
Advertisement

Indians in Gulf | ఇరాన్‌ (Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు వ‌రుస‌గా మూడోరోజు కొన‌సాగుతున్నాయి. ఇక ఈ దాడుల‌కు ఇరాన్ సైతం ప్ర‌తిదాడుల‌కు పూనుకుంది. ముఖ్యంగా గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యాలు, వైమానిక స్థావ‌రాల‌పై విరుచుకుప‌డుతోంది. ఇలా దాడులు, ప్ర‌తిదాడుల‌తో మ‌ధ్య‌ప్రాచ్యం అట్టుడుకుతోంది. ఈ యుద్ధం కార‌ణంగా గ‌ల్ఫ్ ప్రాంతాల‌కు విమాన స‌ర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో ఆయా దేశాల్లో ప‌ర్యాట‌కులు, విద్యార్థులు, కార్మికులు స‌హా వేలాది మంది భార‌తీయులు చిక్కుకుపోయారు (Indians in Gulf). వారంతా అక్క‌డ దిక్కుతోచ‌ని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. త‌మ‌ను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకురావాల‌ని కోరుతున్నారు. ఈ మేర‌కు భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి సోష‌ల్ మీడియా ద్వారా విజ్ఞ‌ప్తులు పంపుతున్నారు.

ఉపాధి కోసం వ‌చ్చి.. బంక‌ర్ కోసం వెతుకులాట‌..

జీవ‌నోపాధి కోసం మ‌న దేశం నుంచి చాలా మంది గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్తుంటారు. వేలాది మంది భార‌తీయులు అక్క‌డ ప‌నిచేస్తున్నారు. గ‌ణాంకాల ప్ర‌కారం.. మధ్యప్రాచ్యంలో 90 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన కార్మికులే. ప్ర‌స్తుతం యుద్ధం కార‌ణంగా వారంతా అక్క‌డే చిక్కుకుపోయారు. స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు. దీంతో ఓ కార్మికుడు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌ధాని మోదీకి ఓ కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. జీవ‌నోపాధి కోసం దుబాయ్‌కి వ‌చ్చాన‌ని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు బంక‌ర్ల కోసం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి అని వాపోయారు. ఈ ఉద్రిక్త‌త వేళ త‌మ‌ను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకెళ్లేలా చొర‌వ చూపాల‌ని వేడుకున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్ర‌మైన దుబాయ్‌, అబుదాబిలోనూ వేలాది మంది ప‌ర్యాట‌కులు చిక్కుకుపోయారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో పూణెకి చెందిన ఇందిరా యూనివ‌ర్సిటీకి చెందిన 84 మంది ఎంబీఏ విద్యార్థులు (Pune MBA students) చిక్కుకుపోయారు. వారంతా యుద్ధ భ‌యంతో బిక్కుబిక్కుమంటూ అక్క‌డ గ‌డుపుతున్నారు. వారంతా త‌మ‌ను కాపాడంటూ భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోదీకి సోష‌ల్ మీడియా ద్వారా విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ముఖ్యంగా టెహ్రాన్‌లోని వైద్య విద్యార్థులు.. సాయం కోరుతూ భావోద్వేగంతో కూడిన వీడియోల‌ను పోస్టు చేస్తున్నారు.

వైద్య‌ విద్యార్థుల ఆవేద‌న‌..

టెహ్రాన్‌లో ఉన్న ఓ భార‌తీయ విద్యార్థి అక్క‌డి ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితులు చాలా దారుణంగా ఉన్న‌ట్లు అందులో పేర్కొన్నారు. త‌మ భ‌ద్ర‌త కోసం భార‌త ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని అయితే, ఇలాంటి స‌మ‌యంలో వేగంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం చాలా ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. అక్క‌డ ప‌రిస్థితి క్ష‌ణ‌క్ష‌ణానికి దిగ‌జారుతోంద‌ని.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా త‌ర‌లింపు ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని వేడుకున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో 2,000 మంది కశ్మీరీ విద్యార్థులు ఉన్నారని, వారిలో చాలామంది వైద్య విద్యను అభ్యసిస్తున్న వారేన‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జమ్ము కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దౌత్యపరమైన జోక్యం కోరుతూ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసింది.

భార‌తీయుల కోసం హెల్ప్‌లైన్ నంబ‌ర్లు..

మ‌రోవైపు బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), టెల్ అవీవ్ అంతటా సైరన్లు మోగుతున్నాయి. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్క‌డ చిక్కుకుపోయిన భార‌తీయుల కోసం హెల్ప్‌లైన్ నంబ‌ర్లను ఏర్పాటు చేసింది.

  • రియాద్ (సౌదీ అరేబియా): 00-966-11-4884697, 00-966-542126748 (వాట్సాప్ నంబ‌ర్), 800 247 1234 (టోల్ ఫ్రీ నంబ‌ర్‌), cw.riyadh@mea.gov.in (Email)
  • ర‌మ‌ల్హా (పాల‌స్తీనా) : +970592916418, repoffice@mea.gov.in / cons.ramallah@mea.gov.in
  • దోహ (ఖ‌తార్‌): 00974-55647502, cons.doha@mea.gov.in
  • టెల్ అవీవ్ (ఇజ్రాయెల్‌) : +972-54-7520711 / +972-54-2428378, cons1.telaviv@mea.gov.in
  • టెహ్రాన్ (ఇరాన్‌): +989128109115 / +989128109109 / +989128109102 / +989932179359
  • అబుదాబి (యూఏఈ): 800-46342 (టోల్ ఫ్రీ నంబ‌ర్‌), +971543090571 (వాట్సాప్ నంబ‌ర్‌), pbsk.dubai@mea.gov.in / ca.abudhabi@mea.gov.in
  • కువైట్ : +96565501946, community.kuwait@mea.gov.in
  • బహ్రెయిన్ : 00973-39418071
  • మ‌స్క‌ట్ (ఒమ‌న్‌): 80071234 (టోల్ ఫ్రీ నంబ‌ర్‌), +96898282270 (వాట్సాప్ నంబ‌ర్‌), cw.muscat@mea.gov.in / cons.muscat@mea.gov.in
  • జోర్దాన్‌: 00962-770 422 276
  • బాగ్దాద్ (ఇరాక్‌): +964 771 651 1185 / +964 770444 4899

Also Read..

Iran | ఇరాన్‌లో 555 మంది మృతి..!

ప‌శ్చిమాసియాలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి : ప్ర‌ధాని మోదీ

ఇరాన్ అనుకూల ర్యాలీలు.. అన్ని రాష్ట్రాల‌ను అల‌ర్ట్ చేసిన కేంద్రం

Advertisement
Advertisement