Iran | ఇరాన్‌లో 555 మంది మృతి..!
Iran | ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులను (US-Israel strike) కొనసాగిస్తోంది. ఇరానియన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటి వరకూ 500 మందికిపైగా మరణించినట్లు స్థానిక మీడియా నివేదించింది.
International | Published On Mar 2, 2026, 2.42 pm IST
Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు (Middle East tensions) మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులను (US-Israel strike) కొనసాగిస్తోంది. ఇరానియన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. వరుసగా మూడో రోజూ టెహ్రాన్‌పై దాడులు కొనసాగుతున్నాయి. ఇక ఈ దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటి వరకూ 500 మందికిపైగా మరణించినట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇరాన్‌లో యూఎస్-ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి టెహ్రాన్‌లో 555 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రెడ్ క్రాస్ సొసైటీని ఉటంకిస్తూ ఇరాన్ మీడియా వెల్లడిస్తోంది. ఇక ఇజ్రాయెల్-యూఎస్ దాడుల్లో దాదాపు 131 నగరాలు ప్రభావితమైనట్లు పేర్కొంది. అనేక మంది గాయపడినట్లు వివరించింది.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకారదాడులు
ఇదిలా ఉండగా.. తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని యూఎస్ ఎంబసీలు, వైమానిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఇవాళ ఉదయం దుబాయ్, దోహా, బెహ్రెయిన్, సైప్రస్, అబుదాబి, మనామా, ఖతార్ సహా పలు గల్ఫ్ నగరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. దీంతో ఆయాన నగరాలు పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లుతున్నాయి. కువైట్‌లోని యూఎస్ ఎంబసీపై (US Embassy) ఇరాన్ డ్రోన్‌తో అటాక్ చేసింది.
దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలముకుంది. అంతేకాదు, దాడి అనంతరం అక్కడికి అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. మరోవైపు కువైట్‌లో ఇరాన్ జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ (US F-15 jet) కూలిపోయింది. MIM-104 పేట్రియాట్ (Patriot) వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, మరికొన్ని యూఎస్ మిలిటరీ విమానాలు కూడా కూలినట్లు ఇరాన్ స్టేట్ మీడియా నివేదిస్తోంది.
Also Read..
Middle East tensions | ఇరాన్ అనుకూల ర్యాలీలు.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
PM Modi | పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి : ప్రధాని మోదీ
కువైట్‌లో అమెరికా ఎంబసీపై దాడి.. కూలిన యూఎస్ ఫైటర్ జెట్..!
సంబంధిత వార్తలు

Petrol Price Hike | బిగ్ అలర్ట్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్పటి నుంచంటే..?
ఏప్రిల్ 23, 2026

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



