Kharif crops | రైతులకు గుడ్‌న్యూస్.. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. వరి క్వింటాకు ఎంతంటే?
Kharif crops | రైతులకు (farmers) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఖరీఫ్ పంటల (Kharif crops) కనీస మద్దతు ధరల పెంపునకు (MSP hike) ఆమోదం తెలిపింది.
Kharif crops | రైతులకు (farmers) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఖరీఫ్ పంటల (Kharif crops) కనీస మద్దతు ధరల పెంపునకు (MSP hike) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2.60 లక్షల కోట్లు కేటాయించింది. అగ్రికల్చర్ కాస్ట్ ప్రైసెస్ కమిషన్ సిఫార్సుల మేరకు వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర కేబినెట్ నిర్ణయించింది (Cabinet Decisions).
క్వింటా వరి కనీస మద్దతు ధర రూ.2,441గా, క్వింటా గ్రేట్-A వరి ధర రూ.2,461గా నిర్ణయించింది. అదేవిధంగా క్వింటా జొన్నలు (హైబ్రిడ్) కనీస మద్దతు ధర రూ.4,023, క్వింటా జొన్నలు (మల్దండి) కనీస మద్దతు ధర రూ.4,073గా నిర్ణయించింది. క్వింటా సజ్జలు రూ.2,775 నుంచి రూ.2,900 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వింటా రాగుల ధర రూ.4,886 నుంచి రూ,5,205కి పెరిగింది. ఇక క్వింటా కందుల ధర రూ.8,000 నుంచి రూ.8,450కి పెరిగింది. వీటితోపాటూ పొద్దుతిరుగుడు విత్తనాల ధరను క్వింటాకు రూ.622 పెంచింది. క్వింటా పత్తిపై రూ.557, క్వింటా నువ్వుల ధర రూ.500 పెంచింది.
బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు రూ.37,500 కోట్లు కేటాయింపు..
అలాగే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు (Coal Gasification Project)కు రూ.37,500 కోట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం.ప్రస్తుతం భారత్ తన అవసరాలకు సంబంధఙంచి 50 శాతానికి పైగా ఎల్‌ఎన్‌జీని, 20 శాతం యూరియాని, దాదాపు 100 శాతం అమ్మోనియాను, 80-90 శాతం మెథనాల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అయితే, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. ఈ ప్రాజెక్టు ద్వారా స్వయంసమృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు కోల్ గ్యాసిఫికేషన్ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishanw) తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా రూ.6,300 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అంతేకాదు, 50 వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు. అదేవిధంగా రూ.20,667 కోట్ల అంచనా వ్యయంతో సర్ఖేజ్-ధొలేరా సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వేట్రాక్ నిర్మాణానికి, నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నతీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read..
కూటమి పార్టీల నుంచి వ్యతిరేకత.. ఓఎస్డీగా రిక్కి రాధన్ పండిట్ నియామకాన్ని రద్దు చేసిన విజయ్
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదు.. ఆర్బీఐ గవర్నర్ కీలక హెచ్చరికలు
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






