Delimitation Bill | లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు.. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Delimitation Bill | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill), మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రధాన డిమాండ్‌కు అనుగుణంగా లోక్‌సభ స్థానాల వాటాను అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా 50 శాతం (50% increase in Lok Sabha seats) పెంచడంతో పాటు.. రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత సీట్ల నిష్పత్తిని (pro-rata share) మరో 25 ఏళ్ల పాటూ అంటే 2051 వరకూ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
Delimitation Bill | త్రినేత్ర న్యూస్ : నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రధాన డిమాండ్‌కు అనుగుణంగా లోక్‌సభ స్థానాల వాటాను అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా 50 శాతం పెంచడంతో పాటు (50% increase in Lok Sabha seats).. రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత సీట్ల నిష్పత్తిని (pro-rata share) మరో 25 ఏళ్ల పాటూ అంటే 2051 వరకూ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. జనగణనతో సంబంధం లేకుండా ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా బిల్లులోని విధివిధానాల్లో పలు మార్పులు చేశారు. దీనివల్ల ప్రతి రాష్ట్రానికి అదనపు సీట్లు దక్కడంతో పాటు, లోక్‌సభలో ఉన్న ప్రస్తుత వాటా దాదాపు అలాగే కొనసాగుతుంది. తక్కువ జనాభా వృద్ధి ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న అభ్యంతరాలను తొలగిస్తూ కేంద్రం ఈ కీలక మార్పును చేపట్టింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లుకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ సవరణలతో కూడిన బిల్లును ఆమోదించేందుకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక బిల్లులకు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చకు పెట్టనున్నారు.
2029 ఎన్నికల నాటికి పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850కి పెంచేలా రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించారు. రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 ఓట్ల అవసరం ఉంటుంది. అయితే, ఈ చట్టం అమలును తదుపరి జనగణనతో ముడిపెట్టడాన్ని విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. దీంతో గత సెషన్‌లో ఈ బిల్లు వీగిపోయింది.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయంగా లబ్ధి చేకూరుతుందని పార్లమెంట్‌లో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కేవలం సీట్ల శాతంలో పెరుగుదల మాత్రమే కాకుండా, రాష్ట్రాల మధ్య దామాషా ప్రాతినిధ్యం (Proportional Representation) దెబ్బతినకూడదనే అంశాన్ని ఈ ఏడాది ఆరంభంలో విపక్షాలు కూడా బలంగా లేవనెత్తాయి. కేబినెట్ తాజా సవరణలు ఈ అంశానికే ప్రాధాన్యత ఇచ్చాయి.
కేబినెట్ ఆమోదించిన సవరణలు దక్షిణాది రాష్ట్రాల ప్రధాన ఆందోళనను తొలగించేలా ఉన్నాయి. కేవలం తాజా జనాభా లెక్కల ఆధారంగా కాకుండా, ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం మేర పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 543 నుంచి 816కు చేరనుంది. జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ఈ కొత్త విధానం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఈ సారి ఈ సవరణలకు పార్లమెంట్‌లో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.
Also Read..
భారత్ సమ్మిట్‌లో ఓట్ చోరీ నినాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
రజనీకాంత్ వర్సెస్ మహేష్‌బాబు - మూడోసారి బాక్సాఫీస్ క్లాష్ - "ధర్మన్" రిలీజ్ డేట్ ఇదే!
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..





