త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | అయ్య‌ప్ప‌ భక్తులకు అలర్ట్.. ఆ మార్గాల్లో వాహనాలకు నో ఎంట్రీ

అయ్య‌ప్ప భ‌క్తులు (Ayyappa Devotees)అత్యంత ప‌విత్రంగా భావించే మ‌క‌ర జ్యోతి (Makara Jyothi) ద‌ర్శ‌నానికి స‌మ‌యం స‌మీపిస్తున్న‌ది. దీంతో ల‌క్ష‌లాది మంది అయ్య‌ప్ప మాల‌ధారులు, భ‌క్తులు శ‌బ‌రిమ‌ల‌కు (Sabarimala) త‌ర‌లివెళ్ల‌నున్నారు.

G

National | Published On Jan 10, 2026, 8.40 am IST

Traffic Restrictions | అయ్య‌ప్ప‌ భక్తులకు అలర్ట్.. ఆ మార్గాల్లో వాహనాలకు నో ఎంట్రీ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: అయ్య‌ప్ప భ‌క్తులు (Ayyappa Devotees)అత్యంత ప‌విత్రంగా భావించే మ‌క‌ర జ్యోతి (Makara Jyothi) ద‌ర్శ‌నానికి స‌మ‌యం స‌మీపిస్తున్న‌ది. దీంతో ల‌క్ష‌లాది మంది అయ్య‌ప్ప మాల‌ధారులు, భ‌క్తులు శ‌బ‌రిమ‌ల‌కు (Sabarimala) త‌ర‌లివెళ్ల‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌ పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించారు. జనవరి 12 నుంచి పంబాలో ఎలాంటి వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆ రోజు నుంచి పంబా వ‌ద్ద ఎలాంటి ప్రైవేటు లేదా ఇత‌ర వాహ‌నాల‌ను నిల‌ప‌డానికి వీల్లేద‌ని తెలిపారు.

అలాగే జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు ఎలాంటి వాహనాల రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అదే రోజు ఉదయం 10 గంటల తర్వాత పంబా నుంచి సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదని స్ప‌ష్టం చేశారు.

ఇక‌ మకర సంక్రాంతి సంద‌ర్భంగా జ్యోతి ద‌ర్శ‌నానికి వ‌చ్చే అ‍య్యప్ప భక్తుల సంఖ్య భారీగా ఉండే నేప‌థ్య‌లో.. నీల‌క్క‌ల్ వ‌ద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల‌ను భ‌క్తులు వినియోగించుకోవాల‌ని పోలీసులు కోరారు. అక్క‌డి నుంచి ప్ర‌భుత్వం న‌డిపే ప్ర‌త్యేక బ‌స్సుల ద్వారా మాత్ర‌మే పంబా వ‌ర‌కు ప్ర‌యాణించాల‌ని సూచించారు. ఈ విషయాన్ని శబరిమల అయ్యప్ప భక్తులు గమనించాలని కేరళ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement