త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Audi Car | అర్ధ‌రాత్రి ఆడీకారు బీభ‌త్సం.. ఒక‌రు మృతి, 15 మందికి గాయాలు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో (Jaipur) ఓ ల‌గ్జ‌రీ కారు బీభ‌త్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి జైపూర్ ప‌ట్ట‌ణంలోని పాత్రకార్ కాలనీలో వేగంగా దూసుకొచ్చిన ఆడీ కారు (Audi Car) అదుపుత‌ప్పి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాద‌చారులపైకి దూసుకెళ్లింది.

G

National | Published On Jan 10, 2026, 9.58 am IST

Audi Car | అర్ధ‌రాత్రి ఆడీకారు బీభ‌త్సం.. ఒక‌రు మృతి, 15 మందికి గాయాలు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాజస్థాన్‌లోని జైపూర్‌లో (Jaipur) ఓ ల‌గ్జ‌రీ కారు బీభ‌త్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి జైపూర్ ప‌ట్ట‌ణంలోని పాత్రకార్ కాలనీలో వేగంగా దూసుకొచ్చిన ఆడీ కారు (Audi Car) అదుపుత‌ప్పి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాద‌చారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరో 15 మంది గాయప‌డ్డారు. దినేశ్ ర‌ణ్వాన్ అనే వ్య‌క్తి శుక్ర‌వారం రాత్రి త‌న ఆడీ కారులో డివైడర్‌ను ఢీకొట్టి దాదాపు 30 మీటర్ల దూరం వరకు రోడ్డుపక్కన ఉన్న స్టాళ్లు, బండ్లను ఢీకొట్టింది. ప‌లు వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. అనుకోని ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో భీతావ‌హ వాతావ‌ర‌ణం నేల‌కొన్న‌ది.

కారులో నలుగురు ఉన్నారని, అంతా మద్యం మత్తులో ఉన్నార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మిగతా వారు పరారీలో ఉన్నార‌ని చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

 

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement