MGNREGA | ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల నిరసన
MGNREGA | మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరులో మహాత్మా గాంధీ (Mahatma Gandhi) పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ (Parliament) లో కాంగ్రెస్ (Congress) ఎంపీల నిరసన వ్యక్తం చేశారు.
MGNREGA | మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు మార్పుపై పార్లమెంట్ (Parliament) లో కాంగ్రెస్ (Congress) ఎంపీల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పథకంలో మహాత్మా గాంధీ (Mahatma Gandhi) పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి పేదవానికి 100 రోజుల పని గ్యారెంటీ ఉండాలని భావించి పథకాన్ని రూపొందించారని గుర్తు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ పేరును ఆ పథకానికి పెట్టారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించిందని మండిపడ్డారు. దాంతో పాటు నూతన మార్పులతో జాతీయ ఉపాధి హామీ పథకం పూర్తిగా నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు ఇచ్చేదని, దానిని 60 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. మిగిలిన 40 శాతం నిధుల భారం రాష్ట్ర ప్రభుత్వంపై మోపుతున్నారని దుయ్యబట్టారు. తక్షణమే కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, బలరాంనాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, సురేశ్ షెట్కార్, రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



