త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Azharuddin | మాజీ క్రికెట‌ర్ మంత్రి ప‌ద‌వి నిలిచేనా?.. నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా అజారుద్దీన్‌?

జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు (Azharuddin) కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. ఆయ‌న ఏ స‌భ‌లోనూ స‌భ్యుడు కాక‌పోవ‌డంతో గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా (MLC) నామినేట్ చేసింది.

G

Telangana | Published On Jan 10, 2026, 10.29 am IST

Azharuddin | మాజీ క్రికెట‌ర్ మంత్రి ప‌ద‌వి నిలిచేనా?.. నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా అజారుద్దీన్‌?
Advertisement

త్రినేత్ర.న్యూస్‌: జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు (Azharuddin) కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. ఆయ‌న ఏ స‌భ‌లోనూ స‌భ్యుడు కాక‌పోవ‌డంతో గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా (MLC) నామినేట్ చేసింది. అయితే నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్య‌వ‌హారం సుప్రీం కోర్టు తీర్పుతో ముడిప‌డి ఉంది. మండ‌లి, శాస‌న స‌భ‌ల్లో ఏ స్థానం ఖాళీగా లేక‌పోవ‌డం, ఆరు నెల‌ల్లో ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉండ‌టంతో.. ఆయ‌న మంత్రి ప‌ద‌విపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న‌ది. అయితే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, ఇటీవ‌ల మండ‌లి చైర్మ‌న్ రాజీనామాను ఆమోదించ‌డంతో మంత్రి అజారుద్దీన్‌కు మార్గం సుగ‌మం అయిన‌ట్లు తెలుస్తున్న‌ది..!

ఆయ‌న‌ను నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయించాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌న‌ప్ప‌టికీ.. వ‌చ్చే నెల‌లో ప్ర‌భుత్వం మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ది. ఆ ఎల‌క్ష‌న్ల‌లో మెజార్టీ స్థానాలు ద‌క్కించుకుని, స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా పార్టీ అభ్య‌ర్థిని గెలిపించుకోవ‌డం తేలికేన‌ని పార్టీ ఓ అంచ‌నాకు వ‌చ్చింది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పరిషత్తుల కాలపరిమితి ముగిసింది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి పూర్తవగానే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి, ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపనుంది. పరిషత్‌ ఓటర్లు లేకున్నా.. మున్సిపల్‌ ఓటర్లతో ఉప ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే ఈ సీటుకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అప్ప‌టికి గానీ మంత్రి అజారుద్దీన్ భ‌విత‌వ్యం తేల‌నుంది. గత ఏడాది అక్టోబర్‌ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం ఆరు నెలలోగా అంటే ఏప్రిల్ 31 నాటికి ఆయ‌న‌ శాసనసభ లేదా మండలిలో సభ్యుడు కావాలి. లేన‌ట్ల‌యితే ఆయ‌న త‌న‌ మంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. సో.. ఈ మాజీ క్రికెట‌ర్ మంత్రి ఉంటుందో? ఊడుతుందో? చూద్దాం..!

Advertisement

తాజావార్తలు

Advertisement