CM Suvendu Adhikari | సరిహద్దుల్లో కంచె.. 45 రోజుల్లో బీఎస్ఎఫ్‌కు భూమి అప్పగింత.. తొలి కేబినెట్‌లో బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయాలు
CM Suvendu Adhikari | తొలి కేబినెట్ సమావేశంలోనే బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద కంచె నిర్మాణం కోసం అవసరమైన భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించాలని నిర్ణయించారు. 45 రోజుల్లోనే భూమి బదిలీ పూర్తి చేస్తామని సీఎం సేవేందు ప్రకటించారు.
CM Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి (CM Suvendu Adhikari) తన మొదటి కేబినెట్ సమావేశంలోనే (Bengal Cabinet meet) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద కంచె నిర్మాణం (border fencing) కోసం అవసరమైన భూమిని సరిహద్దు భద్రతా దళానికి (BSF) అప్పగించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ నేటి నుంచే మొదలవుతుందని.. 45 రోజుల్లోనే భూమి బదిలీ పూర్తి చేస్తామని సీఎం సేవేందు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్‌కు బంగ్లాదేశ్‌తో సుమారు 4,097 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, అందులో 3,240 కిలోమీటర్ల మేర కంచె వేయడం పూర్తైంది. ఇంకా దాదాపు 850 కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉంది. గత మమతా బెనర్జీ ప్రభుత్వం భూసేకరణ విషయంలో జాప్యం చేయడం వల్ల పనులు ఆగిపోయాయని, ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయని సీఎం సువేందుకు స్పష్టం చేశారు.
దీంతోపాటూ సువేందుకు కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని ఐదేళ్లు పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకంతో పాటు ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన వంటి ఇతర పథకాలనూ రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)ను తక్షణ అమలు చేస్తామని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని, జనగణన ప్రక్రియను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సువేందుకు స్పష్టం చేశారు.
Also Read..
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేయండి : కేంద్రానికి 'నైట్స్' లేఖ
బంగారం కొనొద్దన్న ప్రధాని మోదీ.. మరి వెండి మాటేమిటి..?
గ్రామీణ మహిళల జీవనోపాధి ప్రభుత్వం మరో ముందడుగు.. పీవీఎన్ఆర్‌టీయూతో సెర్ప్ ఒప్పందం..
సంబంధిత వార్తలు

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Mamata Banerjee | ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ.. ఎక్స్ బయో ఛేంజ్
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



