Silver | బంగారం కొనొద్దన్న ప్రధాని మోదీ.. మరి వెండి మాటేమిటి..?
Silver | వెండి ధరలు వరుసగా పెరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల తర్వాత మార్కెట్లో కొంత అస్థిరత కనిపించింది. అయితే స్వల్పకాలిక ఒత్తిడి ఉన్నప్పటికీ, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడిదారుల్లో ఇప్పుడు.. ఇది వెండి కొనుగోలుకు సరైన సమయమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Silver | వెండి ధరలు వరుసగా పెరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల తర్వాత మార్కెట్లో కొంత అస్థిరత కనిపించింది. అయితే స్వల్పకాలిక ఒత్తిడి ఉన్నప్పటికీ, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడిదారుల్లో ఇప్పుడు.. ఇది వెండి కొనుగోలుకు సరైన సమయమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంసీఎక్స్ లో జూలై 2026 డెలివరీ వెండి ఫ్యూచర్స్ సోమవారం రూ.3వేలు (1.1 శాతం) పెరిగి కిలోకు రూ.2,64,922 స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 80.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో కూడా వెండి ధరలు రూ.3,500 పెరగడంతో ఇది వరుసగా రెండోరోజు ర్యాలీగా మారింది.
డిమాండ్ బలంగా ఉండే అవకాశం..
భారత్‌లో ప్రస్తుతం వెండి ధరలు 10 గ్రాములకు సుమారు రూ.2,628, కిలోకు రూ.2.62 లక్షల పైగా ఉన్నాయి. హైదరాబాద్ వంటి పలు నగరాలకు చెందిన మార్కెట్లలో కూడా వెండి ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు మళ్లీ సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా బంగారంతో పాటు వెండికీ ఈ పరిస్థితుల్లో డిమాండ్ పెరుగుతుంది. అయితే ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలను కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గించండి అని కోరిన తర్వాత విలువైన లోహాల మార్కెట్లో కొంత ఒత్తిడి కనిపించింది. అయితే నిపుణులు చెబుతున్నదేమిటంటే, వెండి పరిస్థితి బంగారంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంది. వెండి కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఈవీ (EV) రంగాల్లో పారిశ్రామికంగా వినియోగం కూడా ఎక్కువగా ఉండటంతో దీర్ఘకాల డిమాండ్ బలంగా ఉండే అవకాశముందని పేర్కొంటున్నారు.
భారీగా ధరలు పెరిగే చాన్స్..
కొంతమంది విశ్లేషకులు వెండి ధరల్లో ఇంకా పైకి ఎగబాకే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితే వెండి ధరలు అధిక స్థాయిల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే భారీ ర్యాలీ వచ్చిన నేపథ్యంలో స్వల్పకాలంలో ప్రాఫిట్ బుకింగ్, అస్థిరత కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు. నిపుణులు తెలిపిన ప్రకారం ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా దశలవారీగా వెండిలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఫిజికల్ సిల్వర్, సిల్వర్ ఈటీఎఫ్ లు లేదా ఎంసీఎక్స్ సిల్వర్ ద్వారా పెట్టుబడులు పెట్టే ముందు పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






