త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Delhi Declaration | భార‌త్ దౌత్య విజ‌యం.. న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు బ్రిక్స్ దేశాల ఏక‌గ్రీవ ఆమోదం

New Delhi Declaration | 'న్యూఢిల్లీ డిక్లరేషన్' (New Delhi Declaration)కు బ్రిక్స్ దేశాలు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఏక‌ప‌క్ష యుద్ధాలు, సుంకాలు, ఉగ్ర‌వాదాన్ని తీవ్రంగా ఖండించాయి.

D

National | Published On Sep 12, 2026, 5.33 pm IST

New Delhi Declaration | భార‌త్ దౌత్య విజ‌యం.. న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు బ్రిక్స్ దేశాల ఏక‌గ్రీవ ఆమోదం
Advertisement

New Delhi Declaration | త్రినేత్ర‌.న్యూస్ : న్యూఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న‌ 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో భార‌త్‌కు దౌత్యపరంగా ఒక భారీ విజయం ద‌క్కింది. సదస్సులో భాగంగా రూపొందించిన 'న్యూఢిల్లీ డిక్లరేషన్' (New Delhi Declaration)కు కూటమిలోని సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఈ తీర్మానంలో ప్ర‌ధానంగా ఏక‌ప‌క్షంగా జ‌రుగుతున్న యుద్ధాల‌ను, దాడుల‌ను ఖండించాల‌ని బ్రిక్స్ దేశాలు నిర్ణ‌యించాయి. అంతర్జాతీయ సమస్యలకు యుద్ధాల కంటే చర్చలు, సంప్రదింపులు, దౌత్య విధానాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని స్పష్టం చేశాయి. అయితే, అంతర్జాతీయ వ్యూహాత్మక సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా ఏ దేశం పేరును ప్రస్తావించలేదు. న్యూ ఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఏ ఒక్క సభ్య దేశం కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్ర‌ధాని తెలిపారు. ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ప్ర‌క‌టించారు.

బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలైన ఇరాన్, యూఏఈల మధ్య మధ్యప్రాచ్యం (West Asia) వివాదాల నేపథ్యంలో తీవ్ర విభేదాలు ఉన్నప్ప‌టికీ ఈ డిక్ల‌రేష‌న్ విష‌యంలో అన్ని దేశాలూ ఏక‌తాటిపైకి రావ‌డం విశేషం. భారత దౌత్య సిబ్బంది శుక్ర‌వారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు జరిపిన సుదీర్ఘ చర్చల ద్వారా దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఈ ఉమ్మడి ప్రకటనపై అందరితో సంతకాలు చేయించడంలో విజయం సాధించారు.

యుద్ధాల ఖండనతో పాటు ప్ర‌పంచ వాణిజ్య సంస్థ నిబంధ‌న‌ల‌కు (World Trade Organization rules) విరుద్ధంగా వాణిజ్యాన్ని దెబ్బతీసేలా విధిస్తున్న ఏక‌ప‌క్ష సుంకాల‌ను బ్రిక్స్ దేశాలు ఈ డిక్ల‌రేష‌న్‌లో తీవ్రంగా త‌ప్పుప‌ట్టాయి. అంతేకాదు, సుంకేతర నిబంధనల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) లాంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని, బ్రిక్స్ దేశాల మధ్య అంతర్గత వాణిజ్యానికి అమెరికా డాలర్ స్థానంలో సొంత కరెన్సీలను వాడాలని కూడా ఇందులో నిర్ణయించారు.

గ‌తేడాది జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడిని (terrorism) బ్రిక్స్ దేశాలు ఈ డిక్ల‌రేష‌న్‌లో తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదుల సరిహద్దు దాటడం, నిధులు, సుర‌క్షిత ఆశ్ర‌యాల‌ను పూర్తిగా అణ‌చివేయాల‌ని పేర్కొన్నాయి. ఉగ్ర‌వాదాన్ని ఏ మ‌తం, జాతీయ‌త‌, జాతి స‌మూహంతో ముడిపెట్ట‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశాయి. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు, వాటికి మ‌ద్ద‌తు ఇస్తున్న ప్ర‌తి ఒక్క‌రినీ జాతీయ, అంత‌ర్జాతీయ చ‌ట్టాల ప్ర‌కారం బాధ్యుల‌ను చేసి వారిని చ‌ట్టం ముందు నిల‌బెట్టాల‌ని పిలుపునిచ్చాయి.

Image

Also Read..

నా వార‌సురాలు ఆమే.. యూపీ ఎన్నికల వేళ మాయావతి సంచలన నిర్ణయం

ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబ‌డి.. ఇన్వెస్ట‌ర్ల‌పై కాసులు కురిపిస్తున్న ఫైబ‌ర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్‌..

నారాయ‌ణ‌పేట డీఎఫ్‌వో అరుదైన ఘ‌న‌త‌

Advertisement
Advertisement