త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GV Prasad | నారాయ‌ణ‌పేట డీఎఫ్‌వో అరుదైన ఘ‌న‌త‌

GV Prasad | నారాయణపేట జిల్లా అగ్నిమాపక కేంద్రంలో డీఎఫ్‌వోగా విధులు నిర్వర్తిస్తూ.. పరుగుల ప్రపంచంలో సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటున్నారు జీవీ ప్రసాద్.

S

Telangana | Published On Sep 12, 2026, 5.15 pm IST

GV Prasad | నారాయ‌ణ‌పేట డీఎఫ్‌వో అరుదైన ఘ‌న‌త‌
Advertisement

ఖ‌ర్దుంగ్ లా చాలెంజ్ విజేత‌గా నిలిచిన జీవీ ప్ర‌సాద్
17,965 అడుగుల ఎత్తులో 13 గంటల్లో 72 కి.మీ. ఖర్దుంగ్ లా ఛాలెంజ్ పూర్తి

GV Prasad | త్రినేత్ర‌.న్యూస్ : నారాయణపేట జిల్లా అగ్నిమాపక కేంద్రంలో డీఎఫ్‌వోగా విధులు నిర్వర్తిస్తూ.. పరుగుల ప్రపంచంలో సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటున్నారు జీవీ ప్రసాద్. ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యతలో నిరంతరం అప్రమత్తంగా ఉండే ఆయన.. తాజాగా లడాఖ్‌లో సముద్ర మట్టానికి 17,965 అడుగుల (5,476 మీటర్లు) ఎత్తులో ఉన్న ఖర్దుంగ్ లా పర్వత ప్రాంతంలో నిర్వహించిన 72 కిలోమీటర్ల ఖర్దుంగ్ లా ఛాలెంజ్–2026ను 13 గంటల్లో విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనత సాధించారు.

అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో నిర్వహించే కఠినమైన పరుగుల్లో ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌ ఒకటి. తక్కువ ఆక్సిజన్, చలి వాతావరణం, కఠినమైన పర్వత మార్గాలు రన్నర్ల సామర్థ్యానికి పెద్ద సవాల్‌గా నిలుస్తాయి. అలాంటి పరిస్థితులను అధిగమిస్తూ ప్రసాద్ ఈ సవాల్‌ను పూర్తి చేశారు.

లడాఖ్ మారథాన్‌తో అర్హత

ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌కు ముందు జీవీ ప్రసాద్ లడాఖ్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. సముద్ర మట్టానికి సుమారు 11,500 అడుగుల ఎత్తులో ఉన్న లడాఖ్‌లో 42.20 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడం ద్వారా ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌లో పాల్గొనే అర్హత సాధించారు.

‘ప్రోకామ్ స్లామ్’లోనూ ఘనత

2024–25లో ప్రోకామ్ స్లామ్‌లో భాగంగా బెంగళూరులో 10 కి.మీ., ఢిల్లీలో 25 కి.మీ., కోల్‌కతాలో 25 కి.మీ., ముంబైలో 42.20 కి.మీ. రేసులను విజయవంతంగా పూర్తి చేశారు. వివిధ రేసుల్లో ఇప్పటివరకు 50 పతకాలు సాధించారు.

డీజీ అభినందనలు

ఈ అరుదైన విజయంపై తెలంగాణ అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement