త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mayawati | నా వార‌సురాలు ఆమే.. యూపీ ఎన్నికల వేళ మాయావతి సంచలన నిర్ణయం

Mayawati | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్ర మాయావ‌తి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో కుటుంబ స‌భ్యుల‌కు ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, వంశపారంపర్య రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేస్తూనే.. ఒకవేళ తన సోదరుడు ఆనంద్ కుమార్ కుమార్తె దీపిక (Deepika Anand) పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తే ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు.

D

National | Published On Sep 12, 2026, 4.35 pm IST

Mayawati | నా వార‌సురాలు ఆమే.. యూపీ ఎన్నికల వేళ మాయావతి సంచలన నిర్ణయం
Advertisement

Mayawati | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ‌ బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ (Akash Anand)ను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌రో మేన‌ల్లుడైన ఇషాన్‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మాయావ‌తి తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో కుటుంబ స‌భ్యుల‌కు ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, వంశపారంపర్య రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేస్తూనే.. ఒకవేళ తన సోదరుడు ఆనంద్ కుమార్ కుమార్తె దీపిక ఆనంద్ (Deepika Anand)పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తే ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు.

"బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా బహుజన్ సమాజ్ ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ఎవరైనా అడ్డంకిగా మారితే సహించేది లేదు. కాన్షీ రామ్ మాదిరిగానే నేను కూడా నా తోబుట్టువులు, వారి కుటుంబ సభ్యులను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు, ఇతర రాజకీయ ప్రయోజనాలకు దూరం పెట్టి, కేవలం పార్టీ సేవలకే పరిమితం చేశాను. నేను అవివాహితను కావడంతో.. నా భద్రత, గౌరవం కోసం నా తమ్ముడు ఆనంద్ కుమార్‌ను నా వ‌ద్ద‌ ఉంచుకోవాల్సి వచ్చింది. ఆయన నా బాగోగులతో పాటు పార్టీ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా లబ్ధి పొందితే అది పార్టీకి, ఉద్యమానికి నష్టం కలిగిస్తుంది" అని మాయావతి పేర్కొన్నారు.

అందుకే ఇక‌పై ఆనంద్ కుమార్ కుమారుల‌కు బీఎస్పీలో ఎలాంటి రాజ‌కీయ ప‌ద‌వులు ఇవ్వ‌బోమ‌ని మాయావ‌తి స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం లా చ‌దువుతున్న త‌న త‌మ్ముడు ఆనంద్ కుమార్ కుమార్తె దీపికా ఆనంద్ భవిష్య‌త్తులో పార్టీ బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డంలో తండ్రికి సాయ‌పడొచ్చ‌ని తెలిపారు. ఆమె నిజాయితీ, ప‌నితీరును బ‌ట్టి బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు దీపిక సిద్ధంగా లేక‌పోతే.. పార్టీలోని ఇత‌ర సీనియ‌ర్‌నేత‌ల అంగీకారంతో ద‌ళిత వ‌ర్గానికి చెందిన ఓ మిష‌న‌రీ కార్య‌క‌ర్త‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. అదే స‌మ‌యంలో బహుజన్ సమాజ్ పార్టీపై సోషల్ మీడియా, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను, కుట్రలను న‌మ్మొద్ద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆమె కోరారు. యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా శత్రువులు పన్నే కుట్రలను తిప్పికొట్టాలని, అంబేడ్కర్ ఆశయ సాధన కోసం శ్రేణులంతా ఐక్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.

Also Read..

మాక్ అసెంబ్లీ రాజ‌కీయ డ్రామా కాదా..?

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మైథాల‌జీ మూవీకి సీక్వెల్ - గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌

రూ.200 కోట్ల 'ఏక్తా మాల్' ప్రైవేట్ బిల్డర్ల జేబుల్లోకి? శాసనమండలిలో సర్కార్‌ను నిలదీసిన దాసోజు శ్రవణ్

Advertisement
Advertisement