త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబ‌డి.. ఇన్వెస్ట‌ర్ల‌పై కాసులు కురిపిస్తున్న ఫైబ‌ర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్‌..

Sterlite Technologies | స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు తాజాగా 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. వచ్చే నాలుగైదేళ్లలో కంపెనీ వృద్ధిపై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆశావాదం షేర్‌లో ర్యాలీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పుణెకు చెందిన ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.20వేల‌ కోట్ల ఆదాయాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్ణ‌యించుకుంది.

S

Business | Published On Sep 12, 2026, 5.18 pm IST

Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబ‌డి.. ఇన్వెస్ట‌ర్ల‌పై కాసులు కురిపిస్తున్న ఫైబ‌ర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్‌..
Advertisement

Sterlite Technologies | స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు తాజాగా 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. వచ్చే నాలుగైదేళ్లలో కంపెనీ వృద్ధిపై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆశావాదం షేర్‌లో ర్యాలీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పుణెకు చెందిన ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.20వేల‌ కోట్ల ఆదాయాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్ణ‌యించుకుంది. టెలికాం టెక్నాలజీకి చెందిన ఈ షేర్ గతేడాది కాలంలో ఏకంగా 641 శాతం రాబడిని అందించింది. ఆరు నెలల్లో దాదాపు 397 శాతం పెరిగింది. కంపెనీ ప్రతిష్ఠాత్మకమైన లక్ష్య ప్రాజెక్ట్ కింద 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.20వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచంలోని టాప్ ఐదు కంపెనీల్లో ఒకటిగా నిలవాలని సంస్థ భావిస్తోంది.

టార్గెట్ రూ.1వేయి దిశ‌గా..

స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్‌లో బ్రేక్‌అవుట్ స్పష్టమైన పాజిటివ్ నిర్మాణానికి సంకేతంగా ఉందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ తెలిపారు. షేర్ ప్రస్తుతం 20 డీఎంఏ, 50 డీఎంఏ, 100 డీఎంఏ, 200 డీఎంఏ స్థాయిలకు సౌకర్యవంతంగా ఎగువన ట్రేడవుతోందని ఆయన పేర్కొన్నారు. టెక్నికల్ పరంగా రూ.800-815 తక్షణ మద్దతు జోన్‌గా ఉంటుందని, ఆ తర్వాత రూ.750-765 స్థాయి మరో కీలక మద్దతుగా ఉంటుందని ప్రవేశ్ గౌర్ తెలిపారు. గతంలో బ్రేక్ అవుట్ జరిగిన రూ.680-700 ప్రాంతం ఇప్పుడు ప్రధాన పొజిషనల్ సపోర్ట్‌గా మారిందన్నారు. పైవైపు రూ.900 తక్షణ మానసిక నిరోధక స్థాయిగా ఉంటుందని, రూ.900 పైన షేర్ స్థిరంగా ముగిస్తే రూ.950-1000 దిశగా వెళ్లే అవకాశం ఉందని వివరించారు.

రూ.850 వ‌ద్ద మ‌ద్ద‌తు..

షేర్ ధర పెరుగుతున్న ప్రధాన ఈఎంఏల పైన కొనసాగుతూ, వరుసగా కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తోందని బొనాంజా సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ విరాట్ జగడ్ తెలిపారు. తాజా బ్రేక్‌అవుట్‌కు బలమైన ట్రేడింగ్ పరిమాణం మద్దతుగా ఉందని, ఆర్‌ఎస్‌ఐ కూడా అధిక స్థాయిలో ఉండడం వేగాన్ని నిర్ధారిస్తోందని చెప్పారు. రూ.780-800 ప్రాంతంలో షేర్ ధర తగ్గినప్పుడు తాజా ఎంట్రీని పరిశీలించవచ్చని, రూ.850 వద్ద మద్దతు ఉండగా రూ.900 వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలంలో స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్‌పై దృక్పథం సానుకూలంగానే ఉందని షేర్.మార్కెట్ బై ఫోన్‌పే క్వాంట్ రీసెర్చర్ నిశ్చల్ జైన్ తెలిపారు. అయితే స్వల్పకాలంలో షేర్ ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయ‌ని ఆయన హెచ్చరించారు.

రూ.1వేయి చేరే అవ‌కాశం..

సమీప కాలంలో షేర్ ధర రూ.900-920 పరిధిలో స్థిరపడే అవకాశం ఉందని నిశ్చల్ జైన్ అంచనా వేశారు. అధిక మార్జిన్ కలిగిన ఏఐ ఆప్టికల్ ఉత్పత్తుల సరఫరా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో పెరిగే కొద్దీ, బుల్లిష్ పరిస్థితుల్లో రూ.1వేయి వరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆప్టికల్ టీఏఎం విస్తరణ, కస్టమర్ సహకారంతో ఉత్పత్తుల అభివృద్ధి, సమగ్ర కనెక్టివిటీ పరిష్కారాలు, సాంకేతికత ఆధారిత విభిన్నత స్టెర్లైట్ టెక్నాలజీస్ వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉన్నాయి. తదుపరి దశ వృద్ధికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.5 రెట్లు పెంచాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి ఏడాది సుమారు రూ.1వేయి కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. దీని ద్వారా పనితీరు, ఫైబర్, కేబుల్ ఉత్పత్తి సామర్థ్యాలను 50 శాతం పెంచాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. భారత్‌లో ప్రీ-టెర్మినేటెడ్ కనెక్టివిటీ సొల్యూషన్స్ కోసం గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, నిరంతర సాంకేతిక ఆవిష్కరణల కోసం ప్రతి ఏడాది ఆదాయంలో 2 శాతం కేటాయించాలని కంపెనీ నిర్ణయించింది.

ఒక్క సెష‌న్‌లోనే 5 శాతం ర్యాలీ..

ఇక స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్ ధర గ‌త సెష‌న్‌లో 897.45 వ‌ద్ద ముగిసింది. ఈ షేర్ ధ‌ర ఒక్క రోజులోనే 5 శాతం మేర (రూ.42.70) పెర‌గ‌డం విశేషం. ఈ షేర్ ప్ర‌స్తుతం 52 వారాల గ‌రిష్ట స్థాయి వ‌ద్ద ట్రేడవుతుండ‌గా, పెట్టుబ‌డిదారులు ఇందులో పెట్టుబ‌డులు పెట్టేముందు మ‌ద్ద‌తు స్థాయిల్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని నిపుణులు సూచించారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ సుమారు రూ.46వేల కోట్లు ఉండ‌గా, పీఈ నిష్ప‌త్తి 196.48 గా ఉంది. 52 వారాల క‌నిష్ట స్థాయి రూ.84.60 కాగా గ‌త సెష‌న్‌లో ఈ షేర్ ధ‌ర రూ.870 వద్ద ప్రారంభం అయింది. అయితే స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు ఎవ‌రైనా స‌రే నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం ఉత్త‌మం.

Advertisement
Advertisement