త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | ఆ ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలి : దాసోజు శ్రవణ్ డిమాండ్

తెలంగాణ ఉద్యమ కళాకారుల సమస్యలపై శాసనమండలిలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గళమెత్తారు. గద్దర్ స్మారకానికి ఎకరం స్థలంతో పాటు వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Sep 12, 2026, 5.02 pm IST

Dasoju Sravan | ఆ ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలి : దాసోజు శ్రవణ్ డిమాండ్
Advertisement
  • సాంస్కృతిక వారధిలోని 582 మంది కళాకారులకు శాశ్వత సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్
  • కాంగ్రెస్ హామీ మేరకు ఒగ్గు, డప్పు కళాకారులకు నెలకు రూ.3000 జీవనభృతి ఇవ్వాలని విజ్ఞప్తి
  • నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారకానికి ఎకరం భూమి కేటాయించాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • చిత్రపురి కాలనీ అక్రమాలపై విచారణ, దర్శకుడు ఎన్. శంకర్‌కు స్టూడియో స్థలంపై ప్రభుత్వానికి ప్రశ్నలు

Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన పేదింటి కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శాసనమండలిలో ఆయన కళాకారుల హక్కులు, పెండింగ్ సమస్యలపై గళమెత్తారు. పాటలు, జానపదాల ద్వారా ఉద్యమాన్ని రగిలించిన గద్దరన్న, గూడ అంజన్న, గోరేటి వెంకన్న, అందెశ్రీ త్యాగాలను ఈ సందర్భంగా ఆయన సభలో స్మరించుకున్నారు.

సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి

సాంస్కృతిక వారధిలో పనిచేస్తున్న 582 మంది కళాకారులకు వెంటనే శాశ్వత సర్వీస్ రూల్స్ (Service Rules) తో పాటు పీఆర్సీ (PRC), పీఎఫ్ (PF) సౌకర్యాలు కల్పించాలని శ్రవణ్ ప్రభుత్వాన్ని కోరారు. చిన్న చిన్న రోగాల బారిన పడుతున్న కళాకారులకు హెల్త్ కార్డులు (Health Cards) ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదని, వెంటనే వాటిని మంజూరు చేయాలని సూచించారు. అలాగే జిల్లాల్లో మిగిలిపోయిన అర్హులైన కళాకారుల కోసం కొత్తగా మరో 500 పోస్టులు (Posts) క్రియేట్ చేయాలన్నారు. ప్రభుత్వ ప్రచారాలకు వెళ్లే కళాకారుల జీతాల్లో కోతలు విధించకుండా.. సరైన టీఏ, డీఏలతో పాటు మైక్ రవాణా ఖర్చులు చెల్లించాలని డిమాండ్ చేశారు. భాషా సాంస్కృతిక శాఖ వద్ద మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

గద్దర్ స్మారకానికి భూమి.. మేనిఫెస్టో హామీల అమలు

నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారకార్థం కేటాయిస్తామన్న ఒక ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో (Manifesto) ఇచ్చిన హామీ మేరకు.. ఒగ్గు, డప్పు కళాకారులకు నెలకు రూ.3,000 చొప్పున జీవనభృతి పూర్తిస్థాయిలో అందించాలన్నారు.

చిత్రపురి కాలనీలో (Chitrapuri Colony) జరిగిన అవకతవకలపై గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే సమగ్ర ఎంక్వయిరీ (Enquiry) జరిపించాలని ఆయన గుర్తుచేశారు. ఇక 'జై బోలో తెలంగాణ' లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించి తెలంగాణ ఉద్యమానికి తోడ్పడిన దర్శకుడు ఎన్. శంకర్ లాంటి ప్రతిభావంతులకు కొత్త సినీ స్టూడియోల (Studios) నిర్మాణానికి అవసరమైన స్థలాలతో పాటు ఆర్థిక సాయం అందించాలని దాసోజు శ్రవణ్ కోరారు.

Advertisement
Advertisement