త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్ష‌న్ బాట ప‌డితే – ఆద‌ర్శ కుటుంబం టీజ‌ర్ వ‌చ్చేసింది – రిలీజ్ డేట్‌పై క్లారిటీ

వెంక‌టేష్ ఆద‌ర్శ కుటుంబం మూవీ టీజ‌ర్ రిలీజైంది. ఫ‌న్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ అంశాల‌తో టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. పోస్ట్‌పోన్ రూమ‌ర్ల‌కు మేక‌ర్స్ చెక్ పెట్టారు. అక్టోబ‌ర్ 2నే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Sep 12, 2026, 5.01 pm IST

Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్  .. యాక్ష‌న్ బాట ప‌డితే – ఆద‌ర్శ కుటుంబం టీజ‌ర్  వ‌చ్చేసింది – రిలీజ్ డేట్‌పై క్లారిటీ
Advertisement

Adarsha Kutumbam |  హీరో వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ పోస్ట్‌పోన్ రూమ‌ర్ల‌కు మేక‌ర్స్ చెక్‌ పెట్టారు. ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న‌ ఈ మూవీ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. త్రివిక్ర‌మ్ శైలి పంచ్‌లు, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, వెంక‌టేష్ కామెడీ టైమింగ్‌తో ఈ టీజ‌ర్ ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగింది.

అప్పుల తిప్ప‌లు...

ఈ టీజ‌ర్‌లో భార్య చేసే అప్పుల కార‌ణంగా ఇబ్బందులు ప‌డే భ‌ర్త‌గా వెంక‌టేష్ క‌నిపించారు. డ‌బ్బుకు స‌బ్బుకు ఓ పోలిక ఉంది.మొద‌టిని చూస్తుండ‌గానే క‌రిగిపోతుంది. రెండోది ఆలోచించేలోపు అరిగిపోతుంది అంటూ వెంక‌టేష్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజ‌ర్ ప్రారంభ‌మైంది. "నువ్వు అందిన‌చోట‌ల్లా అప్పు చేయి...నేను ప‌ప్పు చేస్తాను"..."అడుక్కునేవాళ్ల‌కు ఆదివారం ఉంటుంది కానీ అప్పులోల్ల‌కు ఉండ‌దు"..."నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉంద‌ని తెలుసు. కానీ సిట్యూవేష‌న్ డిమాండ్ చేస్తే యాక్ష‌న్ చేయ‌డానికి వెనుకాడ‌ను"... అంటూ వెంక‌టేష్ చెప్పిన డైలాగ్స్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీకి థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్ జోడిస్తూ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్ చూస్తుంటే తెలుస్తోంది.

శ్రీనిధి శెట్టి...

ఆద‌ర్శ కుటుంబంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్, రఘుబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు కూడా త్రివిక్ర‌మ్ అందించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

రూమ‌ర్ల‌కు చెక్‌...

కాగా ఆద‌ర్శ కుటుంబం మూవీ వాయిదా ప‌డ‌నున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు డిలే కావ‌డం ప్ర‌క‌టించిన డేట్‌కు కాకుండా వారం లేదంటే రెండు వారాలు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి వార్త‌లొచ్చాయి. ఈ రూమ‌ర్ల‌పై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్‌లో ఎలాంటి ఛేంజ్ లేద‌ని, అక్టోబ‌ర్ 2నే ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.ఆద‌ర్శ‌కుటుంబం మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement