Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు విడాకులిస్తే భార్యకు రూ.5 లక్షల కోట్ల ఆస్తి?
Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఆయన భార్య లోరీ మిల్స్ విడాకులు తీసుకుంటే ఆస్తుల విభజన ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం ఉమ్మడి వైవాహిక ఆస్తిలో భార్యకు సగం వాటా లభించే అవకాశం ఉంది. ఎన్విడియా షేర్ల విలువ ఆధారంగా ఈ వాటా సుమారు 60 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5 లక్షల కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. అయితే వీరిద్దరూ విడాకులపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఆయన భార్య లోరీ మిల్స్ విడాకులు తీసుకుంటే ఆస్తుల విభజన ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం ఉమ్మడి వైవాహిక ఆస్తిలో భార్యకు సగం వాటా లభించే అవకాశం ఉంది. ఎన్విడియా షేర్ల విలువ ఆధారంగా ఈ వాటా సుమారు 60 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5 లక్షల కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. అయితే వీరిద్దరూ విడాకులపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇద్దరి పేరుతోనే కంపెనీ ఏర్పాటు..
ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ తన భార్యకు తాను నమ్మకద్రోహం చేసినట్లు ఉద్యోగులకు వెల్లడించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తన వ్యక్తిగత నిర్ణయాలకు కుటుంబ సభ్యులు బాధ్యులు కారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ నిఘా సంస్థల ప్రయత్నాలకు సంబంధించి వచ్చిన వార్తలపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర దర్యాప్తును ప్రకటించింది. అయితే జెన్సన్, లోరీ హువాంగ్ దంపతులు విడాకుల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో వీరిద్దరూ పరిచయమయ్యారు. ఆదివారాల్లో తనతో కలిసి హోంవర్క్ చేస్తే మంచి గ్రేడ్లు వచ్చేలా సహాయం చేస్తానని జెన్సన్ చెప్పడంతో వారి పరిచయం మొదలైంది. అనంతరం వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. 1993లో జెన్సన్ ఎన్విడియాను స్థాపించగా, 1995 మే 1న ఇద్దరి పేర్లతో లివింగ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. సంస్థ స్థాపనకు ముందే వివాహం జరగడంతో, కాలిఫోర్నియా చట్టాల ప్రకారం వివాహం తర్వాత సంపాదించిన ఉమ్మడి ఆస్తిని సాధారణంగా ఇద్దరికీ సమానంగా పంచే అవకాశం ఉంటుంది. అయితే ప్రీనప్షియల్ లేదా పోస్ట్‌నప్షియల్ ఒప్పందాలు, ట్రస్ట్ నిబంధనలు ఈ విభజనను ప్రభావితం చేస్తాయి.
60 బిలియన్ డాలర్ల వాటా..
ఎన్విడియా దాఖలు చేసిన పలు పత్రాల్లో లోరీ హువాంగ్ పేరు కూడా కనిపిస్తోంది. 2009లో కంపెనీలో ఆమెకు 3.9 శాతం వాటా ఉన్నట్లు వెల్లడైంది. 2012లో ఏర్పాటు చేసిన ఇర్రివోకబుల్ ట్రస్ట్‌కు ఇద్దరూ సహ ధర్మకర్తలుగా ఉన్నట్లు 2017 పత్రాల్లో పేర్కొన్నారు. 2019 ప్రాక్సీ పత్రాల్లో లోరీ లిన్ హువాంగ్ 2016 యాన్యుటీ ట్రస్టుల వివరాలు కూడా ఉన్నాయి. మరోవైపు, ఈ ఏడాది సెప్టెంబర్‌లో జెన్సన్, లోరీ దంపతులు 4.38 లక్షల ఎన్విడియా షేర్లను విరాళంగా ఇచ్చారు. ఇందులో మూడింట రెండొంతులు కుటుంబ ఫౌండేషన్‌కు, మిగిలినవి డోనర్ అడ్వైజ్డ్ ఫండ్‌కు కేటాయించారు. అనంతరం వారి లివింగ్ ట్రస్ట్‌లో 46,76,93,547 షేర్లు మిగిలినట్లు పత్రాలు వెల్లడించాయి. గత సెషన్ మార్కెట్ ముగింపు ధర ప్రకారం ఈ షేర్ల విలువ దాదాపు 84 బిలియన్ డాలర్లు. ట్రస్ట్ ఆధీనంలోని కంపెనీల షేర్లను కూడా కలిపితే మొత్తం విలువ సుమారు 107.4 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇందులో సగం వాటా సుమారు 53.7 బిలియన్ డాలర్లు. జెన్సన్ వ్యక్తిగతంగా కలిగి ఉన్న షేర్లను కూడా లెక్కలోకి తీసుకుంటే భార్యకు లభించే వాటా సుమారు 60 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే ఇతర ఇర్రివోకబుల్ ట్రస్టులలోని ఆస్తులు కూడా ఉమ్మడి వైవాహిక ఆస్తిగా పరిగణించబడతాయా లేదా అనేది వాటి ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది.
మాకెంజీ స్కాట్ విడాకుల ఉదాహరణ..
2019లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో విడాకుల అనంతరం మాకెంజీ స్కాట్‌కు అమెజాన్‌లో దంపతుల ఉమ్మడి వాటాలో సుమారు నాలుగో వంతు లభించింది. అప్పట్లో అది కంపెనీలో దాదాపు 4 శాతం వాటా కాగా, విడాకులు ఖరారయ్యే సమయానికి దాని విలువ 38.3 బిలియన్ డాలర్లు. అయితే ఆ షేర్లపై ఓటింగ్ అధికారం జెఫ్ బెజోస్ వద్దే కొనసాగింది. ఇదే తరహాలో ఎన్విడియా షేర్లలో 60 బిలియన్ డాలర్ల విలువైన వాటా లోరీకి లభిస్తే, కంపెనీలో ఆమెకు సుమారు 1.4 శాతం వాటా దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. షేర్లను విక్రయించకుండానే బదిలీ చేసే అవకాశం ఉండడంతో తక్షణ మూలధన లాభాల పన్ను కూడా వర్తించదు. అయితే భవిష్యత్తులో వాటిని విక్రయిస్తే పన్ను భారం తప్పదు. ఎన్విడియా షేర్ల ధరలో 20 శాతం మార్పు వచ్చినా 60 బిలియన్ డాలర్ల అంచనాలో 12 బిలియన్ డాలర్ల వరకు తేడా వస్తుంది. అందువల్ల తుది ఆస్తి విలువ మార్కెట్ ధరలు, ట్రస్ట్ ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మూడు దశాబ్దాల క్రితం ఒకే ట్రస్ట్‌పై పేర్లు నమోదు చేసుకున్న ఈ దంపతుల సంపద ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తులలో ఒకటిగా మారింది.
తాజావార్తలు
- ●Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్లో మహా పాదయాత్ర
- ●Police Constable | లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Sonia Gandhi | మోదీతో పెద్దగా పరిచయం లేదు.. ప్రధాని పదవి తిరస్కరణ వెనుక కారణం ఇదే.. ఆత్మకథలో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు
- ●Gold And Silver Prices Today | బంగారం ర్యాలీకి బ్రేక్.. ఒక మోస్తరుగా తగ్గిన పసిడి ధరలు.. పెట్టుబడులకు సరైన సమయమా..?
- ●Floating post office | దేశంలో ఏకైక తేలియాడే పోస్టాఫీస్.. ఇకపై ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు సేవలు
- ●Ozempic | జీఎల్పీ-1 మందులతో కంటి చూపు కోల్పోయే ప్రమాదం.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరిక..

Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్లో మహా పాదయాత్ర

Police Constable | లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య

Sonia Gandhi | మోదీతో పెద్దగా పరిచయం లేదు.. ప్రధాని పదవి తిరస్కరణ వెనుక కారణం ఇదే.. ఆత్మకథలో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు

Gold And Silver Prices Today | బంగారం ర్యాలీకి బ్రేక్.. ఒక మోస్తరుగా తగ్గిన పసిడి ధరలు.. పెట్టుబడులకు సరైన సమయమా..?






