త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nvidia | ఎన్విడియా వివాదం.. చైనా గూఢచర్య చరిత్రలో మరో కోణం..

Nvidia | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ నెలకొన్న గూఢచర్య ఆరోపణలు అమెరికాలో మరోసారి చైనా నిఘా కార్యకలాపాలపై చర్చకు దారితీశాయి. 2000 సంవత్సరం నుంచి అమెరికాను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యానికి పాల్పడినట్లు 224 ఘటనలను సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్) గుర్తించింది. సాంకేతిక రహస్యాల సేకరణ నుంచి రాజకీయ ప్రభావం చూపడం వరకు చైనా నిఘా వ్యూహాలు విస్తరించినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

S

International | Published On Nov 10, 2026, 12.34 pm IST

Nvidia | ఎన్విడియా వివాదం.. చైనా గూఢచర్య చరిత్రలో మరో కోణం..
Advertisement

Nvidia | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ నెలకొన్న గూఢచర్య ఆరోపణలు అమెరికాలో మరోసారి చైనా నిఘా కార్యకలాపాలపై చర్చకు దారితీశాయి. 2000 సంవత్సరం నుంచి అమెరికాను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యానికి పాల్పడినట్లు 224 ఘటనలను సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్) గుర్తించింది. సాంకేతిక రహస్యాల సేకరణ నుంచి రాజకీయ ప్రభావం చూపడం వరకు చైనా నిఘా వ్యూహాలు విస్తరించినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

224 గూఢ‌చ‌ర్య ఘ‌ట‌న‌లు..

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన గూఢచర్య ఆరోపణలు అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న సాంకేతిక పోటీని మరోసారి తెరపైకి తెచ్చాయి. అయితే తమ సంస్థకు సంబంధించిన రహస్యాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం దుర్వినియోగమైనట్లు భావించడానికి ఎలాంటి కారణాలు లేవని ఎన్విడియా వెల్లడించింది. సీఎస్ఐఎస్ అధ్యయనం ప్రకారం.. నమోదైన 224 గూఢచర్య ఘటనల్లో 69 శాతం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన 2012-13 తర్వాత చోటుచేసుకున్నాయి. వీటిలో 49 శాతం ఘటనల్లో చైనా సైనిక లేదా ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పాల్గొనగా, 41 శాతం ఘటనల్లో ప్రైవేటు చైనా పౌరులు ఉన్నారు. మిగిలిన 10 శాతం ఘటనల్లో చైనా అధికారులచే నియమించబడిన అమెరికన్లు సహా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారు. గుర్తించగలిగిన గూఢచర్య పద్ధతుల్లో 46 శాతం సైబర్ నిఘాకు సంబంధించినవే. మొత్తం ఘటనల్లో 54 శాతం వాణిజ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఉండగా, 29 శాతం సైనిక సాంకేతికత, 17 శాతం అమెరికా పౌర సంస్థలు, రాజకీయ నాయకులకు సంబంధించిన సమాచార సేకరణపై దృష్టి పెట్టాయి.

ఏయే ప‌ద్ధ‌తుల్లో చైనా గూఢ‌చ‌ర్యం చేస్తోంది..?

చైనా గూఢచర్య వ్యూహాలు కేవలం సైబర్ దాడులు, రహస్య పత్రాల దొంగతనానికే పరిమితం కాలేదని సీఎస్ఐఎస్ వెల్లడించింది. డబ్బు, వ్యక్తిగత సంబంధాలు, లైంగిక ఆకర్షణ వంటి మార్గాల ద్వారా కీలక సమాచారం కలిగిన వ్యక్తులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా జరిగాయని పేర్కొంది. సైనిక స్థావరాలు, పరిశోధనా కేంద్రాలకు సమీపంలో ఆస్తులు కొనుగోలు చేయడం వంటి అసాధారణ పద్ధతులను కూడా ప్రస్తావించింది. 2003లో చైనా హ్యాకర్లు అమెరికాలోని నావల్ ఎయిర్ వెపన్స్ స్టేషన్ చైనా లేక్ నుంచి అణ్వాయుధ పరీక్షలు, రూపకల్పన, స్టెల్త్ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2005లో టైటాన్ రైన్ పేరుతో అమెరికా రక్షణ నెట్‌వర్క్‌లు, కాంట్రాక్టర్లపై సైబర్ దాడులు జరిగాయి. అదే ఏడాది అమెరికా పౌరుడు నోషిర్ గోవాడియా క్రూయిజ్ క్షిపణి ఎగ్జాస్ట్ వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక సహాయాన్ని చైనాకు అందించిన కేసులో చిక్కుకున్నారు. బోయింగ్ ఏరోస్పేస్ సాంకేతికత, సెమీకండక్టర్ వాణిజ్య రహస్యాల చోరీ, నాసా, పెంటగాన్ నెట్‌వర్క్‌లపై చొరబాట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఒప్పందం కుదిరాక కూడా గూఢ‌చ‌ర్యం..?

2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య వాణిజ్య ప్రయోజనాల కోసం సైబర్ గూఢచర్యాన్ని పరిమితం చేసే ఒప్పందం కుదిరిన తర్వాత బహిరంగంగా నమోదైన ఘటనలు గణనీయంగా తగ్గాయని సీఎస్ఐఎస్ తెలిపింది. అయితే ఏడాది తిరగకముందే ఈ తగ్గుదల మళ్లీ వెనక్కి మళ్లిందని పేర్కొంది. ఈ గణాంకాలు బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడినవేనని, వాస్తవ ఘటనలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే గతంలో నమోదైన గూఢచర్య పద్ధతులకు జెన్సన్ హువాంగ్ వ్యవహారానికి నేరుగా సంబంధం ఉందని సీఎస్ఐఎస్ నిర్ధారించలేదు. ఎన్విడియా వ్యవహారంలో వచ్చిన ఆరోపణలకు స్వతంత్ర ధ్రువీకరణ అవసరమని స్పష్టం చేసింది. వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార ప్రయోజనాలు, కీలక వ్యక్తులపై ప్రభావం చూపడం ద్వారా వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నదే ఈ అధ్యయనం వెల్లడిస్తున్న ప్రధాన అంశంగా మారింది. ఈ క్ర‌మంలో రానున్న రోజుల్లో చోటుచేసుకోనున్న ప‌రిణామాలు అత్యంత కీల‌కంగా మారే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement