త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam | సినిమా సెట్స్‌లో అస్వ‌స్థ‌త – ప్ర‌ముఖ మ‌ల‌యాళ సినిమాటోగ్రాఫ‌ర్ క‌న్నుమూత‌

మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. దిగ్గ‌జ సినిమాటోగ్రాఫ‌ర్ షాజీకుమార్ గుండెపోటుతో మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. ఓ సినిమా షూటింగ్‌లో అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మ‌ల‌యాళంలో యాభైకిపైగా సినిమాల‌కు కెమెరామెన్‌గా ప‌నిచేశారు షాజీకుమార్‌.

N

Entertainment | Published On Nov 10, 2026, 12.51 pm IST

Malayalam | సినిమా సెట్స్‌లో అస్వ‌స్థ‌త – ప్ర‌ముఖ మ‌ల‌యాళ సినిమాటోగ్రాఫ‌ర్ క‌న్నుమూత‌
Advertisement

Malayalam | మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. దిగ్గ‌జ సినిమాటోగ్రాఫ‌ర్ షాజీకుమార్ గుండెపోటుతో మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. దిలీప్‌ హీరోగా న‌టిస్తోన్న మ‌ల‌యాళ సినిమాకు షాజీకుమార్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌లో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. షాజీకుమార్‌ను చిత్ర బృందం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

యాభైకిపైగా సినిమాలు...

మ‌ల‌యాళంలో యాభైకిపైగా సినిమాల‌కు షాజీ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి, దిలీప్ వంటి అగ్ర హీరోలంద‌రితో ప‌నిచేశారు. మాస్‌, యాక్ష‌న్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో గుర్తింపును సొంతం చేసుకున్నారు.

వంద కోట్లు....

మ‌ల‌యాళంలో వంద కోట్లు రాబ‌ట్టిన తొలి సినిమా పులిమురుగ‌న్‌కు షాజీ కుమార్ కెమెరామెన్‌గా ప‌నిచేశారు. 2001లో జ‌య‌రాం హీరోగా న‌టించిన ఉత్త‌మ‌న్ సినిమాతో షాజీ కుమార్ కెరీర్ మొద‌లైంది. తొలి సినిమాతోనే విజ‌యాన్ని అందుకున్న ఆయ‌న మ‌ల‌యాళ‌లో బిజీయెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా మారిపోయారు. మోహ‌న్‌లాల్‌తో షాజీ కుమార్‌కు చ‌క్క‌టి అనుబంధ‌ముంది. ఆయ‌న హీరోగా న‌టించిన న‌ర‌న్‌, ఒడియ‌న్‌, పులిమురుగ‌న్, తుడ‌రుమ్ సినిమాల‌కు షాజీ ఛాయాగ్ర‌హ‌కుడిగా ప‌నిచేశారు.

షూటింగ్ పూర్తి.....

మ‌ధుర రాజా, రామ్‌లీలా, రాబిన్‌హుడ్‌, వెల్లిన‌క్ష‌త్ర‌, రింగ్ మాస్ట‌ర్‌, ఒట్ట‌కొంబ‌న్‌తో పాటు ప‌లు సినిమాలు షాజీకుమార్‌కు మంచి పేరుతెచ్చిపెట్టాయి. షాజీకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన అభిమ‌నోహ‌రం డిసెంబ‌ర్ 24న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. ఒట్ట‌కొంబ‌న్ షూటింగ్ కూడా పూర్తిచేశారు. ఈ రెండు సినిమాల రిలీజ్ ముగింట షాజీకుమార్ క‌న్నుమూయ‌డం మ‌ల‌యాళ సినీ వ‌ర్గాల‌ను దిగ్భాంతికి గురిచేసింది.

 

Advertisement
Advertisement