త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donkey Fair | బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిద‌ల అమ్మ‌కాలు.. రూ.72,000 పలికిన చుంకీ పాండే..!

Donkey Fair | దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రకూట్‌లో (Chitrakoot)ని మందాకిని నది (Mandakini River) తీరంలో నిర్వ‌హించిన గాడిద‌ల మేళా (Donkey Fair) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, షారుఖ్ ఖాన్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి వంటి స్టార్ల పేర్ల మీదుగా గాడిద‌ల‌ను అమ్మ‌కానికి పెట్ట‌గా.. 'చుంకీ పాండే' (Chunky Pandey) అత్య‌ధికంగా రూ.72 వేల‌కు అమ్ముడుపోయింది.

D

National | Published On Nov 10, 2026, 12.27 pm IST

Donkey Fair | బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిద‌ల అమ్మ‌కాలు.. రూ.72,000 పలికిన చుంకీ పాండే..!
Advertisement

Donkey Fair | త్రినేత్ర న్యూస్ : దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల‌ సరిహద్దుల్లోని చిత్రకూట్‌లో (Chitrakoot) గాడిద‌ల మేళా (Donkey Fair) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, షారుఖ్ ఖాన్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి వంటి స్టార్ల పేర్ల మీదుగా గాడిద‌ల‌ను అమ్మ‌కానికి పెట్టారు. అయితే, పెద్ద స్టార్స్‌ను వెన‌క్కి నెట్టి 'చుంకీ పాండే' (Chunky Pandey) అనే పేరుగల నల్లటి గాడిద అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఉత్సాహభరితంగా సాగిన‌ వేలం పాటలో చుంకీ పాండే ఏకంగా రూ. 72,000లకు అమ్ముడుపోయింది. ఈసారి మేళాలో అత్య‌ధిక ధ‌ర‌ను సొంతం చేసుకున్న గాడిద‌గా నిలిచింది. గ‌తేడాది షారుక్ ఖాన్ పేరున్న గాడిద అత్య‌ధిక ధ‌ర ప‌లికింది.

శ‌తాబ్దాల కాలంగా సాగుతున్న సాంప్ర‌దాయం

ఈ మేళా మొఘల్ పాలకుడు ఔరంగజేబు (Aurangzeb) కాలం నాటిది. చిత్రకూట్ (Chitrakoot)లోని ఆలయాలపై దండెత్తిన సమయంలో సైన్యంలోని గుర్రాలు, గాడిదలు, కంచరగాడిదలు అన్నీ అప్పట్లో అస్వస్థతకు గురయ్యాయట. అనేక మూగజీవాలు మరణించాయి. ఆ కొర‌త‌ను తీర్చ‌డానికి సైన్యానికి అవ‌స‌ర‌మైన కొత్త జంతువుల‌ను కొనుగోలు చేయ‌డానికి ఔరంగ‌జేబు ఆదేశాల మేర‌కు ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. శ‌తాబ్దాల కాలంగా సాగుతున్న ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ఆసియాలోనే అతిపెద్ద గాడిదల మేళాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

రూ.కోట్ల‌ల్లో వ్యాపారం..

మందాకిని నది (Mandakini River) తీరంలో ప్రతి ఏటా నిర్వహించే ఈ మేళాకు దేశం న‌లుమూల‌ల నుంచి వ్యాపారులు, కొనుగోలు దారులు త‌ర‌లివ‌స్తారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు వేలాదిగా తరలివస్తారు. ఇక్కడ గాడిదలు, కంచరగాడిదలతో పాటు గుర్రాల కొనుగోళ్లు, అమ్మకాలు కూడా భారీ స్థాయిలో జరుగుతాయి. విక్రయదారులు తమ గాడిదలను కొనుగోలుదారులు ఆక‌ర్షించేందుకు బాలీవుడ్ నటులైన అమితాబ్ బ‌చ్చ‌న్‌, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి న‌టుల పేర్లు పెట్టి వాటి వయసు, సామర్థ్యాన్ని బట్టి వేల రూపాయల ధరలకు విక్రయిస్తుంటారు. ఈ మేళా సందర్భంగా ఏటా ఇక్క‌డ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా.

పండ‌గ‌ వేళ గాడిద‌ల కొనుగోలు శుభసూచికం

చాలామంది వ్యాపారులకు ఇది కేవలం కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ మాత్రమే కాదు. దీపావళి పవిత్ర రోజుల్లో వీటిని కొనడం వల్ల తమ వ్యాపారాలు వృద్ధి చెందుతాయని, అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. పండుగ సమయంలో వీటిని కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ మేళా సంద‌ర్భంగా స్థానిక అధికారులు అక్క‌డ ప్ర‌త్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. వ్యాపారుల కోసం భ‌ద్ర‌త‌, తాగునీటి, వ‌స‌తి ఏర్పాట్లును ప‌క‌డ్బందీగా చేప‌డ‌తారు. అయితే, ఎంతో సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న‌ప్ప‌టికీ.. ఈ మేళా క్ర‌మంగా ఆద‌ర‌ణ కోల్పోతున్న‌ట్లు నిర్వాహ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read..

మోదీతో పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు.. ప్రధాని పదవి తిర‌స్క‌ర‌ణ వెనుక కార‌ణం ఇదే.. ఆత్మ‌క‌థ‌లో సోనియా గాంధీ ఆసక్తికర విష‌యాలు

ఎన్విడియా సీఈఓ చేసిన త‌ప్పు.. సంస్థ‌కు భారీ న‌ష్టం.. 1.57 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు ఆవిరి..

18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌.. క‌రీంన‌గ‌ర్‌లో మ‌హా పాద‌యాత్ర‌

Advertisement
Advertisement