త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్‌ బి స్ట్రాంగ్ వార్నింగ్!

కృష్ణుడి ప్రార్థనను వక్రీకరిస్తూ వార్తలు రాసిన మీడియాపై అమితాబ్ బచ్చన్ నిప్పులు చెరిగారు. తాను ఒక్క సైగ చేస్తే అభిమానులు తిప్పికొడతారంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

J

Entertainment | Published On Nov 2, 2026, 3.19 pm IST

Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్‌ బి స్ట్రాంగ్ వార్నింగ్!

సంక్షిప్త సారాంశం

శ్రీకృష్ణుడి స్తుతిని ప్రత్యర్థులకు విసిరిన సవాలుగా తప్పుగా ప్రసారం చేసిన మీడియాపై బిగ్‌ బి ఫైర్. తనకున్న 5 కోట్ల మంది ఫాలోవర్లలో 10 శాతం మంది ఒక్క సైగ కోసం చూస్తున్నారని హెచ్చరిక. తప్పులు జరిగితే తాము క్షమాపణ కోరతామని, కానీ మీడియాకు వక్రీకరించడమే జన్మహక్కా అని సూటి ప్రశ్న. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే అభిమానులను పలకరించిన అమితాబ్.

Advertisement
  • కృష్ణుడి భక్తిపాటను వక్రీకరిస్తారా?
  • ఒక్క సైగ చాలు
  • మీడియాకు అమితాబ్ బచ్చన్ సీరియస్ వార్నింగ్

Amitabh Bachchan Lord Krishna Post | త్రినేత్ర న్యూస్ : ఎప్పుడూ హుందాగా, సంయమనంతో కనిపించే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్నట్టుండి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ తాను సోషల్ మీడియాలో పెట్టిన ఓ సాధారణ భక్తి పోస్ట్‌ను కొన్ని మీడియా సంస్థలు కావాలని వక్రీకరించడంపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తన మాటకు తప్పుడు రంగు పులిమిన సదరు వార్తా సంస్థకు సోషల్ మీడియా వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

అక్టోబర్ 29న అమితాబ్ బచ్చన్ తన అధికారిక ఖాతాలో కృష్ణుడిని స్మరిస్తూ.. "హాథీ ఘోడా పాల్కీ, జై కన్హయ్య లాల్ కీ" అంటూ సాంప్రదాయ భక్తి పంక్తులను పోస్ట్ చేశారు. అయితే, ఓ ప్రముఖ హిందీ న్యూస్ పోర్టల్ దీనిపై తప్పుడు కథనాన్ని అల్లింది. బిగ్‌ బి తన ప్రత్యర్థులనుద్దేశించి "రండి.. మీ ఏనుగులు, గుర్రాలను తీసుకురండి" అంటూ ఘాటు సవాలు విసిరారంటూ వార్త ప్రసారం చేసింది.

ఈ వక్రీకరణపై అమితాబ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. "శ్రీకృష్ణ భగవానుడి ప్రార్థనను సైతం తమ సొంత ప్రచారం కోసం దిగజార్చి రాయడం దారుణం. ఇది ఒక పవిత్రమైన భక్తి నామానికి జరిగిన తీవ్ర అవమానం" అని హిందీలో ఆవేదనతో కూడిన పోస్ట్ పెట్టారు.

"నా ఫాలోవర్లలో 10 శాతం మంది చాలు!"

మీడియా తీరును ఎండగడుతూ బిగ్‌ బి ఘాటు పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు.

"మీడియా మిత్రులారా.. చెవులు తెరిచి వినండి. నాకు సోషల్ మీడియాలో 5 కోట్ల మందికి పైగా ఫాలోవర్ల బలముంది. నేను ఒక్క సైగ చేస్తే చాలు.. వారిలో కేవలం 10 శాతం మంది మిమ్మల్ని తిప్పికొట్టేందుకు క్షణాల్లో రంగంలోకి దిగుతారు. మీరు నా మాటలను వక్రీకరించే కొద్దీ, దానికి వంద రెట్లు గట్టిగా స్పందించే సత్తా నా అభిమానులకు (Extended Family) ఉంది."

సమాజంలో నాలుగో స్తంభమైన మీడియా హద్దులు దాటుతోందని ఆయన విమర్శించారు. "ఒకవేళ మేమేమైనా పొరపాటు చేస్తే వెంటనే క్షమాపణ చెప్పి సరిదిద్దుకుంటాం. కానీ కొందరికి మాత్రం తప్పుడు రాతలు రాయడం జన్మహక్కులా మారిపోయింది" అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

బెదిరింపుల వేళ.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి దర్శనం

84 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ బ్లాగులు, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుతం ఆయనకు ఎక్స్‌లో 4.47 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.62 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇదిలా ఉండగా, ముంబై మేయర్ రీతూ తావ్డేకు వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్‌లో అమితాబ్ నివాసం 'జల్సా'ను పేల్చివేస్తామని హెచ్చరికలు రావడంతో పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. దీంతో ప్రతి ఆదివారం ఇంటి బయట గుమిగూడే వేలాది మంది అభిమానులను పలకరించే అమితాబ్.. ఈ వారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే చేతులెత్తి అభివాదం చేయడం గమనార్హం.

ట్యాగ్స్:

Amitabh BachchanAmitabh Bachchan 50 Million FollowersAmitabh Bachchan Jalsa ThreatAmitabh Bachchan Lord Krishna PostAmitabh Bachchan Warning To MediaBig B Latest News TeluguBig B Media Controversy
Advertisement
Advertisement