త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో అమిత్‌షా పాద‌యాత్ర‌.. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ నుంచి ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | త్రినేత్ర న్యూస్‌: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర (Padayatra) జరగనుంది. ఈ నేపథ్యంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు న‌గ‌రంలోని ప‌లు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.

G

Hyderabad | Published On Nov 2, 2026, 7.55 am IST

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో అమిత్‌షా పాద‌యాత్ర‌.. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ నుంచి ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర న్యూస్‌: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర (Padayatra) జరగనుంది. ఈ నేపథ్యంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు న‌గ‌రంలోని ప‌లు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. 'లోక్‌తంత్ర బచావో - అరాచకత హఠావో' పేరుతో నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న‌ బాబు జగ్జీవన్ రాం (BJR) విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ (MJ Market) వరకు ఈ మ‌హా పాదయాత్ర సాగనుంది. దీంతో బీజేఆర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని సూచించారు.

పాద‌యాత్రతో ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్, తాజ్ ఐలాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. నాంపల్లి, అబిడ్స్, రామ్‌కోటి, కోఠి, చాదర్‌ఘాట్ మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దీంతో ఆర్టీసీ బస్సుల‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని, ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

  • ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు.
  • జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ వైపు మళ్లిస్తారు.
  • లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను అనుమతి లేదు. వాటిని హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
  • హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వద్ద పాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
  • బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, బొగ్గులకుంట, అబిడ్స్ పరిసరాల్లోనూ ట్రాఫిక్ మళ్లిస్తారు.
  • ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి లేదు..
  • జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేస్తారు.
  • లిబర్టీ, రవీంద్రభారతి, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం జంక్షన్ల వైపు వెళ్లవద్దని తెలిపారు.

ట్యాగ్స్:

Amit ShahBJPBJRHyderabadMJ MarketTraffic Restrictions
Advertisement
Advertisement