Hyderabad Metro Phase-2 | మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.275 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
Hyderabad Metro Phase-2 | ఐదు కొత్త కారిడార్లతో జరగనున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Hyderabad Metro Phase-2) విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులను మంజూరు (Funds Release) చేసింది.
Hyderabad Metro Phase-2 | త్రినేత్ర న్యూస్: ఐదు కొత్త కారిడార్లతో జరగనున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Hyderabad Metro Phase-2) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో రూ.రూ.125 కోట్లు రుణం రూపంలో ఇవ్వనుంది. ఈమేరకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.
రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల మేర ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30 శాతం (సుమారు రూ. 5,874 కోట్లు) భరించాల్సి ఉండగా, కేంద్రం 18 శాతం సాయం అందించనుంది. మిగిలిన మొత్తాన్ని జపాన్ (JICA), ఏడీబీ (ADB) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా రుణాలుగా సేకరించాల్సి ఉంది.
నాగోల్-ఎయిర్‌పోర్ట్ మార్గంతో స్టార్ట్
ఈ పనులను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించే నాగోల్-ఎయిర్‌పోర్ట్ (ఎయిర్‌పోర్ట్ కారిడార్) మార్గంతో ముందుగా ప్రారంభించనున్నారు. 2029 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక ఐదు కారిడార్లు అందుబాటులోకి వస్తే నగరంలోని ప్రధాన సమాచార వ్యవస్థ మెరుగుపడనుంది. దీంతో పాటు ఐటీ కారిడార్, పాతబస్తీ, ఔటర్ వైపు వెళ్లే ప్రయాణీకులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.
ఐదు ప్రధాన కారిడార్లు ఏవంటే..
కారిడార్ 1 (నాగోల్ - ఎయిర్‌పోర్ట్): 36.8 కిలోమీటర్లు
కారిడార్ 2 (రాయదుర్గం - కోకాపేట): 11.6 కిలోమీటర్లు
కారిడార్ 3 (ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట): 7.5 కిలోమీటర్లు (పాతబస్తీ లైన్)
కారిడార్ 4 (మియాపూర్ - పటాన్‌చెరు): 13.4 కిలోమీటర్లు
కారిడార్ 5 (ఎల్బీనగర్ - హయత్ నగర్): 7.1 కిలోమీటర్లు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి
- ●Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- ●2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం
- ●Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్ బి స్ట్రాంగ్ వార్నింగ్!
- ●CBFC | సెన్సార్ రూల్స్ మరింత కఠినం - ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చిన సీబీఎఫ్సీ
- ●Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో భారీ ర్యాలీ.. గంటలోనే రూ.6 లక్షల కోట్ల లాభం.. కారణాలేమిటి..?

Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి

Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం

Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్ బి స్ట్రాంగ్ వార్నింగ్!





