త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBFC | సెన్సార్ రూల్స్ మ‌రింత క‌ఠినం – ఫిల్మ్ మేక‌ర్స్‌కు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ

ఫిల్మ్ మేక‌ర్స్‌కు సెన్సార్ బోర్డ్ మ‌రో షాకిచ్చింది. సెన్సార్ రూల్స్‌ను మ‌రింత క‌ఠినం చేసింది. ఇక‌పై విడుద‌ల తేదీ ద‌గ్గర‌ప‌డుతుంద‌ని హ‌డావిడిగా సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డాలు ఉండ‌వ‌ని ప్ర‌క‌టించింది. టైటిల్ విష‌యంలో చివ‌రి నిమిషంలో మార్పులు చేసే అధికారం సెన్సార్ బోర్డ్‌కు ఉంద‌ని అన్న‌ది.

N

Entertainment | Published On Nov 2, 2026, 3.07 pm IST

CBFC | సెన్సార్ రూల్స్ మ‌రింత క‌ఠినం – ఫిల్మ్ మేక‌ర్స్‌కు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ
Advertisement

CBFC |  సెన్సార్ బోర్డ్ తీరుపై గ‌త కొద్ది రోజులుగా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ విష‌యంలో బోర్డ్ తీసుకున్న నిర్ణ‌యాలు వివాదాస్స‌ద‌మ‌య్యాయి. సెన్సార్ చ‌ట్ట‌లో మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉందంటూ చాలా మంది సినీ ప్ర‌ముఖులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే ఫిల్మ్ మేక‌ర్స్ కు సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) మ‌రో షాకిచ్చింది. షూటింగ్‌ల కోసం ఏళ్ల‌కు ఏళ్లు కేటాయించి.. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డిన త‌ర్వాత చివ‌రి నిమిషంలో హ‌డావిడి చేసి అసంపూర్తి కంటెంట్‌తో సెన్సార్ స‌ర్టిఫికెట్ తీసుకోవాల‌ని అనుకుంటే ఇక‌పై కుద‌ర‌ద‌ని అన్న‌ది. అంతే కాదు టైటిల్ విష‌యంలో అభ్యంత‌రాలు ఉంటే మార్చులు చేసే అధికారం త‌మ‌కు ఉంద‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కొత్త స‌వర‌ణ‌ల‌తో కూడిన ఓ జీవోను సీబీఎఫ్‌సీ జారీ చేసింది.

స‌బ్ టైటిల్స్‌...సౌండ్ మిక్సింగ్

సెన్సార్ స‌ర్టిఫికెట్ కోసం అప్ల‌య్ చేసే సినిమాల‌కు సంబంధించి అన్ని ప‌నులు పూర్త‌య్యి ఉండాలి. టైటిల్‌, క్రెడిట్స్‌, స‌బ్ టైటిల్స్‌తో పాటు బీజీఎమ్‌, సౌండ్ మిక్సింగ్ స‌హా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలేవి పెండింగ్‌లో ఉండ‌కూడ‌దు. ఏది అసంపూర్తిగా ఉన్న సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డం కుద‌ర‌దు.

టైటిల్ విష‌యంలో ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే చివరి నిమిష‌లో మార్పులు, చేర్పులు చేసే అధికారం సీబీఎఫ్‌సీకి ఉంది. మేక‌ర్స్ అనుకున్న‌దే ఫైన‌ల్ టైటిల్ కాద‌ని జీవోలో పేర్కొన్నారు. సీబీఎఫ్‌సీ ధృవీక‌రించిన సినిమానే థియేట‌ర్ల‌లో స్క్రీనింగ్ చేయాలి.

ఫైనల్ కాదు...

మేక‌ర్స్ నిర్ణ‌యించిన విడుద‌ల తేదీ ఫైన‌ల్ కాదు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌లో ఉంద‌ని సెన్సార్ స‌ర్టిఫికేట్‌ వేగంగా జారీ చేయ‌డం జ‌రుగ‌దు. ఎగ్జామింగ్‌, రివైంజింగ్ క‌మిటీ ప‌రిశీల‌న‌కు త‌గినంత స‌మ‌యం ఇవ్వాలి. నిర్ధేశించిన గ‌డువు, నిబంధ‌న‌ల దృష్టిలో పెట్టుకొని స‌ర్టిఫికేట్‌ జారీ చేస్తార‌ని ప్ర‌క‌టించింది.  విడుదల తేదీని దృష్టిలో పెట్టుకొని ముందుస్తుగానే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అవ‌స‌ర‌మైన అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేయాల‌ని, అసంపూర్తి ధ‌ర‌ఖాస్తుల‌ను రిజెక్ట్ చేసే అధికారం బోర్డుకు ఉంద‌ని సీబీఎఫ్‌సీ చెప్పింది. రిలీజ్ ఆల‌స్యానికి బోర్డు ఎలాంటి బాధ్య‌త వ‌హించ‌ద‌ని అన్న‌ది.

​

ట్యాగ్స్:

BFCBollywood NewsCBFC GuidelinesCensorship RulesCinema NewsEntertainment NewsFilm CensorshipFilm Certification BoardFilm IndustryIndian CinemaIndian FilmsMovie Certification
Advertisement
Advertisement