బైక్ ప్రయాణాలపై ఆంక్షలు.. ఎన్నికల వేళ బెంగాల్‌లో ఈసీ కఠిన ఆంక్షలు
Election Commission | పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కఠిన ఆంక్షలను అమలు చేసింది. బైక్ ర్యాలీలపై నిషేధం విధించింది. రాత్రిపూట ప్రయాణాలపై కూడా పరిమితులు విధించింది.
అసెంబ్లీ ఎన్నికల (Assembly polls)కు పశ్చిమ బెంగాల్ (West Bengal) సిద్ధమైంది. ఈనెల 23న రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కఠిన ఆంక్షలను విధించింది. బైక్ ర్యాలీలపై నిషేధం విధించింది. అదేవిధంగా రాత్రిపూట ప్రయాణాలపై పరిమితులు విధించింది. తొలి దశలో ఓటింగ్ జరగనున్న 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఆంక్షలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
ప్రయాణాలపై నిషేధం..
ఎన్నికలు పూర్తయ్యే వరకూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను రోడ్లపైకి అనుమతించరు (Bikes banned at night). వైద్య అవసరాలు, ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటి అత్యవసర పరిస్థితులకు మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా పగటిపూట ప్రయాణాలపై కూడా పరిమితులు విధించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బైక్‌పై ఇద్దరు (Pillion riding) వెళ్లకూడదు. అయితే, స్కూల్ పిల్లల్ని దింపేందుకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక పోలింగ్ రోజున ఈ ప్రయాణాలపై కొన్ని సడలింపు ఇచ్చింది ఈసీ. ఓటు వేసేందుకు బైక్‌పై ఇద్దరు వెళ్లేందుకు అనుమతించనున్నారు. అయితే, ఈ ఆంక్షల నుంచి మినహాయింపు పొందేవారు స్థానిక పోలీసు స్టేషన్ నుంచి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read..
భూమి అంతం ఎప్పుడు..? అంచనా వేసిన సూపర్ కంప్యూటర్..!
చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆయుష్ మాత్రే అవుట్..!
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



