Ayush Mhatre | చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆయుష్ మాత్రే అవుట్..!
Ayush Mhatre | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలింది. యువ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మాత్రే టోర్నీలోని మిగతా మ్యాచులకు దూరమయ్యాడు. ఇటీవల కండరాల గాయానికి గురైన విషయం తెలిసిందే.
Ayush Mhatre | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలింది. యువ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మాత్రే టోర్నీలోని మిగతా మ్యాచులకు దూరమయ్యాడు. ఇటీవల కండరాల గాయానికి గురైన విషయం తెలిసిందే. దాన్ని నుంచి కోలుకునేందుకు ఆరు నుంచి 12 వారాలు సమయం పడుతుందని, దాంతో మిగతా మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని సీఎస్‌కే వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నెల 18న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ యువ ఆటగాడు గాయపడ్డాడు. గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. అవుటయ్యే ముందు మైదానంలోనే రెండుసార్లు వైద్య సహాయం తీసుకున్నాడు. క్రీజును వదిలే సమయంలో రామకృష్ట ఘోష్, ఫిజియో టామీ సమ్సెక్ మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు సోమవారం మాత్రేకు స్కానింగ్ చేశారు.
ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టు టోర్నీలో ఓటములతో ఇబ్బందులుపడుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలంలో రెండు విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. తొలి మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన సీఎస్‌కే, ఆ తర్వాత రెండు మ్యాచులు గెలిచింది. ఇటీవల హైదరాబాద్‌లో మళ్లీ ఓటమి పాలైంది. సీఎస్‌కే తరఫున మాత్రే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 177.87 అనే అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు నాథన్ ఎల్లిస్ గాయపడ్డాడు. డెవాల్డ్ బ్రేవిస్ పలు మ్యాచులకు దూరమయ్యాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా అందుబాటులో లేడు. దాదాపు సగం మ్యాచులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. ఇంకా అందుబాటులో ఉంటాడా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. చెన్నై జట్టు ఈ నెల 23న వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






