త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bihar CM | బీహార్‌కు ఇక బీజేపీ ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎంగా నితీశ్ కుమారుడు..?

Bihar CM | బీహార్ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. జేడీయూ అధ్య‌క్షుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్య‌స‌భ (Rajya Sabha)కు వెళ్తున్న నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో ముఖ్య‌మంత్రిగా (Bihar CM) ఎవ‌రు బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

D

National | Published On Mar 6, 2026, 4.49 pm IST

Bihar CM | బీహార్‌కు ఇక బీజేపీ ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎంగా నితీశ్ కుమారుడు..?
Advertisement

Bihar CM | బీహార్ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. రికార్డు స్థాయిలో 10 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధ్య‌క్షుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్య‌స‌భ (Rajya Sabha)కు వెళ్తున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో ముఖ్య‌మంత్రిగా (Bihar CM) ఎవ‌రు బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే, బీహార్‌కు బీజేపీ ముఖ్య‌మంత్రి (Bihar May Get A BJP Chief Minister) వ‌స్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఇప్ప‌టి వ‌ర‌కూ బీహార్ రాష్ట్రాన్ని జేడీయూ, ఆర్జేడీ నేత‌లే పాలించారు. అయితే, ఇప్పుడు తొలిసారి బీజేపీ నేత ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉంది. సీఎం పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అధిష్టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చే అవకాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ నిషాంత్ ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి అడుగుపెట్ట‌లేదు. ఇప్పుడు త‌న తండ్రి ఢిల్లీ రాజ‌కీయాల్లోకి వెళ్తున్న త‌రుణంలో ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జోరందుకుంది. ఇక క్యాబినెట్‌లో జేడీయూ (JDU) నుంచి 15 మంది ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (రామ్ విలాస్) నుంచి ఇద్ద‌రు, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా నుంచి ఒక్కొక్క‌రికి చొప్పున క్యాబినెట్ ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి. సీఎం కుర్చీతోపాటూ అసెంబ్లీ స్పీక‌ర్ ప‌ద‌వి కూడా బీజేపీనే చేప‌డుతుంద‌ని స‌ద‌రు వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Also Read..

Stock Markets | భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వ‌చ్చే వారం కీల‌కం..

UPSC Civil Services | సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంక్ ఎవ‌రికంటే..?

Kalvakuntla Kavitha | నాలుగేళ్ల నా మ‌నోవేద‌న స్వామి వారి ద‌య‌తో తీరిపోయింది : క‌విత‌

Advertisement
Advertisement