త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వ‌చ్చే వారం కీల‌కం..

Stock Markets | భారత స్టాక్‌ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ నష్టాలతో ముగించాయి. అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బెంచ్‌మార్క్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,097 పాయింట్లు (1.37 శాతం) పడిపోయి 78,918.90 వద్ద ముగిసింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 315 పాయింట్లు (1.27 శాతం) తగ్గి 24,450.45 వద్ద స్థిరపడింది.

S

Business | Published On Mar 6, 2026, 3.52 pm IST

Stock Markets | భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వ‌చ్చే వారం కీల‌కం..
Advertisement

Stock Markets | భారత స్టాక్‌ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ నష్టాలతో ముగించాయి. అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బెంచ్‌మార్క్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,097 పాయింట్లు (1.37 శాతం) పడిపోయి 78,918.90 వద్ద ముగిసింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 315 పాయింట్లు (1.27 శాతం) తగ్గి 24,450.45 వద్ద స్థిరపడింది. ఈరోజు ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎట‌ర్న‌ల్‌, శ్రీ‌రాం ఫైనాన్స్ కంపెనీల షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. తాజాగా సౌదీ అరేబియా, బ‌హ్రెయిన్ పై దాడులు జరగడంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు 2025 జూన్ తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు అమెరికా మార్కెట్లలో నిన్నటి ట్రేడింగ్‌లో వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా ఆసియా మార్కెట్లు కూడా ప్రారంభ ట్రేడింగ్‌లో నష్టాల్లోనే కొనసాగాయి.

త‌గ్గిన క్రూడ్ ఆయిల్ ధ‌ర‌..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మార్కెట్ లో పాల్గొనేవారు పలు అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ట్రేడర్లు ముఖ్యంగా నిఫ్టీ50 సూచీలో 24,300 స్థాయిని కీలక సపోర్ట్ లెవల్‌గా గమనిస్తున్నారు. ఈ స్థాయి కంటే దిగువకు చేరితే మరింత ఒత్తిడి పెర‌గ‌వ‌చ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గత వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు జరిపి ఆ దేశ సుప్రీం లీడర్ ఖ‌మేనీని హతమార్చాయి. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు జరపడంతో హోర్ముజ్ జ‌ల‌సంధి ద్వారా సరఫరాకు అంతరాయం ఏర్ప‌డింది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు పైగా చేరాయి. అయితే శుక్రవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 2.4 శాతం తగ్గి బ్యారెల్‌కు 83.21 వ‌ద్ద కొన‌సాగింది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధర 3 శాతం తగ్గి 78.54 డాల‌ర్ల‌ వద్ద ట్రేడైంది.

రాబోయే సెష‌న్లు కీల‌కం..

అమెరికా మార్కెట్లలో ఈ వారం అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్ కొంత స్థిరంగా ఉంది. డౌజోన్స్ ఇండ‌స్ట్రియ‌ల్ యావ‌రేజ్ ఫ్యూచర్స్ 103 పాయింట్లు (0.2 శాతం) పెరిగాయి. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగాయి. నాస్‌డాక్ 100 ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం మేర లాభపడ్డాయి. మధ్యప్రాచ్య సంక్షోభం, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, గ్లోబల్ మార్కెట్ల బలహీనత కలిసి భారత స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి తీసుకొచ్చాయి. పరిస్థితులు ఎలా మారుతాయన్నదే రాబోయే ట్రేడింగ్ సెషన్ల దిశను నిర్ణయించే కీలక అంశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement