త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Biggest Firework | నెల్లికులంగ‌ర భ‌గ‌వ‌తీ ఉత్స‌వాలు.. ఆక‌ట్టుకున్న బాణాసంచా వెలుగులు

Biggest Firework | కేర‌ళ (Kerala)లోని రెండో ప్ర‌సిద్ధ ఆల‌యంగా పేరుగాంచిన శ్రీ నెల్లికులంగ‌ర భ‌గ‌వ‌తీ ఆల‌య (Sri Nellikulangara Bhagavathi Temple) ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

D

National | Published On Apr 3, 2026, 2.50 pm IST

Biggest Firework | నెల్లికులంగ‌ర భ‌గ‌వ‌తీ ఉత్స‌వాలు.. ఆక‌ట్టుకున్న బాణాసంచా వెలుగులు
Advertisement

Biggest Firework | కేర‌ళ (Kerala)లోని రెండో ప్ర‌సిద్ధ ఆల‌యంగా పేరుగాంచిన శ్రీ నెల్లికులంగ‌ర భ‌గ‌వ‌తీ ఆల‌య (Sri Nellikulangara Bhagavathi Temple) ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల్లో పెద్ద ఎత్త‌న భ‌క్తులు పాల్గొన్నారు. అందంగా అలంకరించిన సుమారు 30 ఏనుగులతో భారీ ఊరేగింపు ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ‌రో విశేషం ఏంటంటే భారీ స్థాయిలో బాణాసంచా కాల్చ‌డం (Biggest Firework). గ్రామ‌స్థులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఆ దృశ్యాలుచూసేందుకు రెండు క‌ళ్లూ చాల‌వు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

వల్లంగి, నెన్మరా గ్రామాల ప్రజలు ఉత్సవపండల్ (వేదిక) వద్ద ఎదురెదురుగా నిలబడి సాంప్రదాయక డ్రమ్స్, ప్రదర్శనలతో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ వేడుక‌ల‌ను తిల‌కించేందుకు భ‌క్తులు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ఈ ఉత్స‌వాల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

కేరళలోని పాలక్కాడ్ (Palakkad) జిల్లాలోని నెన్మరా, వల్లంగి గ్రామాల మధ్య నెల్లికులంగర భగవతి ఆలయం ఉంటుంది. అత్యంత ప్రసిద్ధమైన, పురాతనమైన ఆల‌యంగా ప్ర‌సిద్ధి. నెల్లికులంగర భగవతి దేవిని (భ‌ద్ర‌కాళి) పరమ శక్తి స్వరూపిణిగా అక్క‌డి భ‌క్తులు కొలుస్తారు. కేరళలోని త్రిస్సూర్ పురం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన రెండవ అతిపెద్ద ఉత్సవం.

Also Read..

చంద‌మామ దిశ‌గా.. ఆర్టెమిస్-2 మిషన్

మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుడుతుంద‌న్న అనుమానంతో.. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల్ని స్విమ్మింగ్‌పూల్‌లోకి తోసి హ‌త్య‌

యుద్ధం కార‌ణంగా ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల‌కు గ‌డ్డు కాల‌మే.. అంత‌ర్జాతీయ బ్రోక‌రేజీల వెల్ల‌డి..

Advertisement
Advertisement