త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pregnant Wife | మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుడుతుంద‌న్న అనుమానంతో.. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల్ని స్విమ్మింగ్‌పూల్‌లోకి తోసి హ‌త్య‌

Pregnant Wife | హన్మకొండ (Hanamkonda) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గ‌ర్భంతో ఉన్న త‌న భార్య (Pregnant Wife) మ‌ళ్లీ ఆడ‌పిల్ల‌కే జ‌న్మ‌నిస్తుంద‌నే అనుమానంతో భ‌ర్త ఘాతుకానికి పాల్ప‌డ్డాడు.

D

Telangana | Published On Apr 3, 2026, 1.37 pm IST

Pregnant Wife | మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుడుతుంద‌న్న అనుమానంతో.. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల్ని స్విమ్మింగ్‌పూల్‌లోకి తోసి హ‌త్య‌
Advertisement

Pregnant Wife | హన్మకొండ (Hanamkonda) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గ‌ర్భంతో ఉన్న త‌న భార్య (Pregnant Wife) మ‌ళ్లీ ఆడ‌పిల్ల‌కే జ‌న్మ‌నిస్తుంద‌నే అనుమానంతో భ‌ర్త ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. భార్య‌, ఇద్ద‌రు కుమార్తెల‌ను దారుణంగా హ‌త్య చేశాడు. ఈ దిగ్భ్రాంతిక‌ర ఘ‌ట‌న ఐన‌వోలు (Ainavolu) మండ‌లం పున్నేల గ్రామంలో (Punnela village) చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన‌ అజారుద్దీన్, ఫర్హత్ (26) దంపతుల‌కు ఉమేరా (8), అయేషా (6) అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. అజారుద్దీన్ గ్రామ‌ శివార్లలో ఒక స్విమ్మింగ్ పూల్‌ను నిర్వహిస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే, అత‌డికి ఓ కుమారుడు కావాల‌న్న‌ది కోరిక‌. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే భార్య ఫ‌ర్హ‌త్ రెండుసార్లు గ‌ర్భం దాల్చ‌గా.. ఆడ‌పిల్ల పుడుతుంద‌నే కార‌ణంతో అబార్ష‌న్ చేయించాడు. నాలుగేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఆమె మ‌ళ్లీ గ‌ర్భం దాల్చింది. ఈ సారి కూడా ఆడ‌పిల్ల పుడుతుంద‌నే అనుమానంతో క‌డుపు తీయించుకోవాల‌ని భార్య‌పై ఒత్తిడి తెచ్చాడు.

అయితే, ఇప్ప‌టికే రెండు సార్లు అబార్ష‌న్ చేయించుకున్న ఫ‌ర్హ‌త్‌.. మ‌ళ్లీ ఆప‌ని చేసేందుకు నిరాక‌రించింది. ఈ విష‌యంపై భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో ఆగ్ర‌హంతో ఉన్న అజారుద్దీన్‌.. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల్ని స్విమ్మింగ్‌పూల్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి దాంట్లోకి తోసేసి హ‌త‌మార్చాడు. అనంత‌రం వారు ప్ర‌మాద‌వ‌శాత్తు అందులోప‌డి మ‌ర‌ణించిన‌ట్లు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, ఫ‌ర్హ‌త్ తండ్రికి అల్లుడి ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం వ‌చ్చింది. ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అత‌డి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న ఐన‌వోలు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ద‌ర్యాప్తులో భాగంగా అజారుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచార‌ణ‌లో తానే ఈ హ‌త్య చేసిన‌ట్లు అత‌డు అంగీక‌రించాడు.

Also Read..

ఆహార ప‌దార్థాల క‌ల్తీని ఉపేక్షించం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు: సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక

అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవ‌డ‌మే.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త..!

తెలంగాణ తల్లి కన్న ఆణిముత్యాల్లో ఒక‌రు దొడ్డి కొమరయ్య: మధుసూదనా చారి

Advertisement
Advertisement