Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన
Bhatti Vikramarka | రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద మరో రూ.1,900 కోట్లను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Bhatti Vikramarka | రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద మరో రూ.1,900 కోట్లను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్నాథపురంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి మెగా రైతు మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్నాథపురం-మత్కేపల్లి క్రాస్ రోడ్డులో శుక్రవారం నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులంతా పాల్గొంటారని తెలిపారు.
ఈ సభకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా అమలులో ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేసిందని భట్టి తెలిపారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే 8 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.8,759 కోట్లను జమ చేశామని చెప్పారు. తాజాగా రైతు ఆశీర్వాద సభ వేదికగా మరో రూ.1,900 కోట్లను విడుదల చేసి, 9 నుంచి 50 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందించనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనతో పోల్చితే రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే అధిక నిధులు ఖర్చు చేసిందని భట్టి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతు భరోసా పేరుతో సుమారు రూ.75 వేల కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.35 వేల కోట్లను రైతులకు అందించిందన్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బతిన్న రైతులకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంట పెట్టుబడి సాయం, ఇతర సంక్షేమ పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీల అమలులో వెనక్కి తగ్గడం లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చేందుకు సాగునీరు, విద్యుత్, పెట్టుబడి సాయం, మార్కెటింగ్ వంటి అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





