Virosh Wedding | సెలబ్రేషన్స్ ముగిశాయి.. ఇక అండర్‌గ్రౌండ్‌కే : విజయ్ దేవరకొండ
Virosh Wedding | టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాయి.
Virosh Wedding | టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాయి. గత పది రోజులకు పైగా జరిగిన ఈ వేడుకలు నిన్న రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ (Taj Krishna) హోటల్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌తో కంప్లీట్ అయ్యాయి. ఈ విషయాన్ని విరోష్ (Virosh) జంటే స్వయంగా వెల్లడించింది. "వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇవాళ్టితో ముగిశాయి. ఇక అండర్‌గ్రౌండ్‌కే" అని తెలిపింది.
బుధవారం రాత్రి రిసెప్షన్ అయిపోయాకా చివర్లో అందరికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న థ్యాంక్స్ చెప్పారు. మీడియా, అభిమానులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు ప్రత్యకంగా ధన్యవాదాలు తెలిపారు. "అందరికీ థ్యాంక్స్. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ రోజుతో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాయి. ఇక ఎలాంటి సందడి లేకుండా అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోతాం" అని విజయ్ దేవరకొండ సరదాగా అన్నారు. విజయ్ మాటలకు పక్కనే ఉన్న రష్మిక ఒక్కసారిగా నవ్వేసింది. విజయ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పది రోజులుగా బిజీబిజీ..
గత నెల 26న రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మూడు రోజులపాటూ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కొత్త జంట.. హైదరాబాద్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత తమ రిసెప్షన్ కోసం పలువురిని ఆహ్వానించారు. అనంతరం మార్చి 2న విజయ్ తన భార్య రష్మికను తీసుకుని ఫ్యామిలీతో కలిసి తన సొంత ఊరు నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేటకు వెళ్లారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఫామ్‌హౌజ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఊరందరికీ పెళ్లి భోజనాలు పెట్టారు. ఇక నిన్న రిసెప్షన్ చేసుకున్నారు.
హనీమూన్‌కు వెళ్లే ప్లాన్..
అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న విరోష్ జంట.. ఇప్పుడు హనీమూన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ జంట ఎక్కడికి వెళ్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది. మాల్దీవ్స్ లేదా ఇంకెక్కడికైనా వెళ్లే ఛాన్స్ ఉందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
Also Read..
హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా 'విరోష్' వెడ్డింగ్ రిసెప్షన్.. కనువిందు చేస్తున్న విజయ్-రష్మికల జోడీ!
రాజ్యసభ బరిలో నితీశ్ కుమార్.. 11.30 నామినేషన్ వేయనున్న బీహార్ సీఎం!
మీ మాటలతో ఇతరులను ఆకట్టుకోండి.. కానీ విమర్శలకు దూరంగా ఉండండి..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | నేషనల్ క్రష్ డబుల్ ధమాకా – నెల గ్యాప్‌లో రష్మిక రెండు సినిమాలు రిలీజ్
జులై 4, 2026

Rahul Ravindran | ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ.. రష్మికను పుణే సియా గోయల్‌తో పోల్చిన నెటిజన్లు.. ఎక్స్ యాప్ డిలీట్ చేసిన డైరెక్టర్
జూన్ 30, 2026

Rashmika Mandanna | పుష్పరాజ్‌తో మూడోసారి జోడీగా శ్రీవల్లి – “రాకా” లోకి నేషనల్ క్రష్ ఎంట్రీ ఎప్పుడంటే?
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
- ●Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
- ●Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
- ●Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..

Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ



