Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ – దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?
టాలీవుడ్‌కు మరో కొత్త వారసుడు పరిచయం కాబోతున్నాడు. విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. హీరోగా అరంగేట్రం చేయడానికంటే ముందు తండ్రి వెంకటేష్ నటిస్తోన్న ఆదర్శ కుటుంబంలో అర్జున్ అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
Entertainment | Published On Jul 9, 2026, 6.02 pm IST
Venkatesh Son | టాలీవుడ్‌లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ హీరోగా అరంగేట్రం చేయనున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ దగ్గుబాటి వారసుడి డెబ్యూ మూవీపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు.
యాక్టింగ్‌లో ట్రైనింగ్....
అర్జున్ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడు. ఓ వైపు ఉన్నత విద్యను పూర్తిచేస్తూనే మరోవైపు ఫిలిం మేకింగ్, యాక్టింగ్‌లోనూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తండ్రి బాటలోనే యాక్టర్ కావాలన్నది అర్జున్ కల అని సమాచారం. ఇటీవలే తన మనసులోని కోరికను బయటపెట్టాడట. తనయుడి అరంగేట్రానికి వెంకటేష్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.
శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి...
అర్జున్ హీరో డెబ్యూ మూవీ కోసం కథను సెట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. కొత్త దర్శకులతో పాటు శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి వంటి డైరెక్టర్లను అప్రోచ్ అయినట్లు తెలిసింది. తండ్రి బాటలోనే కామెడీ ప్రధానంగా సాగే ఫ్యామిలీ లవ్‌స్టోరీతో అర్జున్ హీరోగా తొలి అడుగు వేయాలని అనుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదే అర్జున్ ఫస్ట్ మూవీ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఆదర్శ కుటుంబంలో...
హీరో ఎంట్రీ కంటే ముందు తండ్రి వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమాలో అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం పవర్‌ఫుల్ ట్రాక్‌ను త్రివిక్రమ్ సిద్దం చేసినట్లు చెబుతున్నారు.. దగ్గుబాటి ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఈ ఎపిసోడ్ ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
శ్రీనిధి శెట్టి....
ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ మూవీలో నారా రోహిత్, దివ్యేందు శర్మ, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!






