త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manan Kumar Mishra | నేను దిగిపోను.. ఏం చేసుకుంటారో చేసుకోండి .. తెగేసి చెప్పిన బీసీఐ చైర్మన్ మ‌న‌న్ కుమార్ మిశ్రా

Manan Kumar Mishra | బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మ‌న‌న్ కుమార్ మిశ్రా (Manan Kumar Mishra) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను రాజీనామా చేసే ప్ర‌సక్తే లేద‌ని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తెగేసి చెప్పారు.

D

National | Published On Aug 22, 2026, 5.30 pm IST

Manan Kumar Mishra | నేను దిగిపోను.. ఏం చేసుకుంటారో చేసుకోండి .. తెగేసి చెప్పిన బీసీఐ చైర్మన్ మ‌న‌న్ కుమార్ మిశ్రా
Advertisement

Manan Kumar Mishra | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ లా యూనివర్సిటీ (NALSAR) వివాదం, రూ.150 కోట్ల స్కాం వంటి వివాదాల‌తో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మ‌న‌న్ కుమార్ మిశ్రా (Manan Kumar Mishra) గ‌త కొంత‌కాలంగా ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న బీసీఐ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను రాజీనామా చేసే ప్ర‌సక్తే లేద‌ని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తెగేసి చెప్పారు.

తాను దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది న్యాయవాదులకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని మ‌న‌న్ తెలిపారు. కేవలం సోషల్ మీడియా ప్రచారాలకో, కొద్దిమంది నిరసనలకో లొంగి పదవి నుంచి తప్పుకునే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల ద్వారా ఎన్నికయ్యానని ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. తనను ఓడించలేని వారే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిల్ (PIL)లు వేస్తూ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. "ప్రజాస్వామ్య‌బ‌ద్ధంగా నేను ఈ ప‌ద‌వికి ఎన్నిక‌య్యా. 12-14 ఏళ్లుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నా. మ‌న‌న్ మిశ్రా 25 ల‌క్ష‌ల మంది న్యాయ‌వాదుల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అంత సుల‌భంగా ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌రు" అంటూ మిశ్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి.. రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు

"నేను ఎన్నికైన ప్రజాప్రతినిధిని. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నన్ను ఎవరూ ఎంపిక చేయలేదు. నామినేట్ చేయలేదు. ఇది అడ్వొకేట్స్‌ యాక్ట్ కింద ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 25 ల‌క్ష‌ల మందికిపైగా న్యాయ‌వాదులు ఇందులో ఓట‌ర్లుగా ఉన్నారు. మొద‌ట వారు రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు త‌మ ప్ర‌తినిధుల‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్ల ప్రతినిధులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ ప్రతినిధులందరూ కలిసి చైర్మన్, వైస్-చైర్మన్‌లను ఎన్నుకుంటారు.

ఇది నా ఏడవ‌ పర్యాయం. గత ఆరు పర్యాయాలుగా నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నేటికీ బార్ కౌన్సిల్ సభ్యుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది నాకు మద్దతు ఇస్తున్నారు. ఒక ట్రస్ట్ గురించైనా లేదా బంధువుల నియామకం గురించైనా కొద్దిమంది వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు చేస్తే.. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ నిరాధారమైన ఆరోపణలు ఇప్పుడే తెరపైకి వస్తున్నాయి. ట్రస్ట్ విషయానికి వస్తే, దాని కార్యకలాపాలన్నీ పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయి. మేనేజింగ్ ట్ర‌స్టీల్లో బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయ‌వాదులు వంటి ప్రముఖులు ఉన్నారు.

ఈ ట్ర‌స్ట్‌కు ఏటా ఆడిట్ జ‌రుగుతుంది. ఆడిట్ నివేదిక‌ను బడ్జెట్‌లో పొందుపరిచి, ప్ర‌చురించి, బ‌హిరంగంగా అందుబాటులో ఉంచుతారు. బార్ కౌన్సిల్‌తో ఎటువంటి సంబంధం లేని CJP వంటి కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వారు న్యాయవాదులను "లీగల్ బొద్దింకలు" (legal cockroaches) అని పిలిచే స్థాయికి దిగజారిపోయారు. న్యాయవాద వృత్తికి ఇది చాలా సిగ్గుచేటు. ఇటువంటి నిరాధారమైన, అర్థం లేని వ్యాఖ్య‌ల‌ను న్యాయవాదుల సమాజం ఎప్పటికీ స‌హించ‌దు. దేశంలోని న్యాయ‌వాదులు కోరుకున్నంత కాలం మ‌న‌న్ మిశ్రాయే బీసీఐ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతారు" అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇది కూడా చ‌ద‌వండి.. మోదీ గారూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే

నిధుల మళ్లింపు ఆరోపణలు, ఏకపక్ష నిర్ణయాల నేపథ్యంలో మనన్ కుమార్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని బార్ కౌన్సిల్ కో-చైర్మన్ వై.ఆర్. సదాశివరెడ్డి (YR Sadasiva Reddy)తో పాటు పలువురు యువ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాను పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని మిశ్రా స్పష్టం చేశారు. మ‌రోవైపు గత 14 ఏళ్లుగా మనన్ కుమార్ మిశ్రా నిరంతరాయంగా బీసీఐ చైర్మన్‌గా కొనసాగడాన్ని సవాలు చేస్తూ 0సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీఐ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీకాల పరిమితిని ఉల్లంఘించారని, తక్షణమే వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read..

రేవంత్‌పై సెటైర్లు.. కొండా సురేఖకు నోటీసులు.. ఎంటర్ అయిన ఓబీసీ సంఘాలు!

చక్కెర ధరలు భగ్గుమంటున్నాయ్.. కార‌ణాలేంటి..?

బ‌తుక‌మ్మ పండుగ‌.. యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కు ఛాలెంజ్‌..!

Advertisement
Advertisement