Murdered | హైదరాబాద్ మీర్‌పేట్‌లో దారుణం.. అర తులం బంగారం కోసం స్కూల్ ఆయా హత్య
Murdered | హైదరాబాద్ మీర్‌పేట్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర తులం బంగారం కోసం ఏకంగా ఓ వృద్ధురాలిని అత్యంత ఘోరంగా హత్య చేశాడో కిరాతకుడు.
- గోనె సంచిలో పెట్టి నీటి సంపులో పడేసిన నిందితుడు
- సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తింపు.. అరెస్టు
త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ మీర్‌పేట్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర తులం బంగారం కోసం ఏకంగా ఓ వృద్ధురాలిని అత్యంత ఘోరంగా హత్య చేశాడో కిరాతకుడు. అనంతరం శవాన్ని గోనె సంచిలో కట్టి నీటి సంపులో పడేశాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ప్రకాశ్‌ను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.
ఇన్‌స్పెక్టర్ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన ప్రకృతాంబ అలియాస్ కళమ్మ (60) 20 ఏళ్ల క్రితం నాదర్‌గుల్‌కు వచ్చి ఇక్కడే ఉంటోంది. మూడు నెలల క్రితం ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా చేరింది. ఆయాగా పనిచేస్తూ ముగ్గురు మనవరాళ్లను పోషిస్తున్నది. గత మంగళవారం విధులకు వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. చిన్న కుమార్తె గాయత్రి, అల్లుడు రాజు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాఠశాల నిర్వహిస్తున్న భవనంలోనే ఉన్న హాట్ చిప్స్ దుకాణంలో పనిచేసే తమిళనాడుకు చెందిన ప్రకాష్ ఆమెను లోపలికి పిలిచినట్లు సీసీ టీవీలో కనిపించింది. దీంతో ప్రకాశ్ మీద అనుమానంతో పోలీసులు ప్రశ్నించగా దుకాణంలోకి వచ్చినా వెంటనే ఆమె వెళ్లిపోయిందని చెప్పాడు. ప్రకృతాంబ కుమార్తె గాయత్రి, అల్లుడు రాజు శుక్రవారం ఉదయం మరోమారు పాఠశాల వద్దకు వచ్చి వెతికారు. పాఠశాల పక్కనే నిర్మాణ పనులు నిలిచిపోయిన భవనం ఉండగా అనుమానంతో అక్కడికి వెళ్లి సంప్‌లోకి చూశారు. అందులో సంచి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంచిని బయటకు తీసి చూడగా.. కుళ్లిన స్థితిలో ప్రకృతాంబ మృతదేహం కన్పించింది.
నిందితుడిని సరైన రీతిలో విచారించగా హత్య విషయాన్ని అంగీకరించాడు. ఆమె చెవులకు ఉన్న అర తులం బంగారు కమ్మలు, రూ.10 వేల నగదు తీసుకుని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం
ఆగస్టు 22, 2026

Naveen Nicolas | ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్ మధ్య కుదిరిన ఎంవోయూ
ఆగస్టు 22, 2026

Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్లో ఏం తప్పులున్నాయో చెప్పాలి
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Disha Patani | దిశా పటానీకి మళ్లీ క్రేజ్.. ఎనిమిదేళ్లకు తొలి హిట్..!
- ●తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం
- ●Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం యోగి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
- ●POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం
- ●SHE Teams | పబ్లిక్ ప్లేసుల్లో యువతులను వేధిస్తున్న రోమియోల భరతం పట్టిన షీ టీమ్స్

Disha Patani | దిశా పటానీకి మళ్లీ క్రేజ్.. ఎనిమిదేళ్లకు తొలి హిట్..!

తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం

Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం యోగి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..



